బాలయ్య వందకి క్రిష్ కన్ఫర్మ్ అయ్యాడా..?

Share this News:

నందమూరి బాలకృష్ణ 100 వ సినిమా గురించి రోజుకో వార్త ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తోంది. మొదట బోయపాటి, బాలయ్య వందో సినిమాను డైరెక్ట్ చేస్తాడనే వార్తలు వినిపించాయి. ఆ తరువాత సింగీతం శ్రీనివాస్ తో ‘ఆదిత్య 999’ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసారని సమ్మర్ నుండి షూటింగ్ కూడా మొదలు పెడతారనే మాటలు వినిపించాయి. కాని ఈ సినిమా గురించి బాలయ్య సన్నిహితులు, అభిమానుల నుండి వ్యతిరేకత రావడంతో ప్రాజెక్ట్ పక్కన పెట్టేసాడని తెలుస్తోంది.

తాజాగా దర్శకుడు క్రిష్ ఎప్పటినుండో అనుకుంటున్న ఓ చారిత్రాత్మక సినిమా లైన్ బాలయ్యకు వినిపించాడట. లైన్ నచ్చడంతో బాలయ్య కథను డెవలప్ చేయమని క్రిష్ కు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం క్రిష్, వరుణ్ తేజ్ తో ‘రాయబారి’ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. మరి బాలయ్య అఫీషియల్ గా క్రిష్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేస్తే ‘రాయబారి’ సినిమాను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి క్రిష్ ఏం చేస్తాడో.. చూడాలి..!

మాట్రిమోనీ సైట్ల‌కు మూడింది
సర్దార్ ఆడియోకి అంత ఖర్చా..?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*