స్టార్ హీరోలకు ఎన్టీఆర్ షాక్ ఇవ్వనున్నాడా..?

Share this News:
నందమూరి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ‘ఆది’,’సింహాద్రి’ అంటూ.. కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రభంజనాలను సృష్టించాడు తారక్. ఆ తరువాత కాస్త స్లో అయినట్లు కనిపించినా.. ఇప్పుడు మళ్ళీ వరుస విజయాలతో దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కొద్ది కాలంగా ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన ఎన్టీఆర్ ‘టెంపర్’ తో తన సత్తా చాటుకున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ హిట్ తో మరో స్థాయికి చేరుకున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ ను యాభై కోట్ల క్లబ్ లో చేరేలా చేసింది.
కాని తారక్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. కేవలం యాభై కోట్లు కాకుండా 100 కోట్ల మార్కెట్ తన సినిమా మీద జరిగేలా టాలీవుడ్ బాద్షా అనిపించేలా అడుగులు వేస్తున్నాడు. తారక్ తలుచుకుంటే 100 కోట్ల మార్కెట్ ను కూడా రీచ్ అవ్వగలడని అభిమానులు భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా కథలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు ఎన్టీఆర్. త్వరలోనే ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోలకు ఎన్టీఆర్ షాక్ ఇవ్వనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పక్కా మాస్ సినిమాతో వస్తే తారక్ ఖచ్చితంగా 100 కోట్లు క్రాస్ చేస్తాడనే మాటలు వినిపిస్తున్నాయి. మరే సినిమాతో తారక్ ఈ ఫీట్ ను క్రాస్ చేస్తాడో చూడాలి..!
కృష్ణవంశీ కు బాలయ్య ఓకే చెప్పాడా..?
కృష్ణగాడి లవర్ కి వరుస అవకాశాలు!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*