గుంటూరులో తానా ఆధ్వర్యంలో భారీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్

Share this News:

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు చెందిన ధార్మిక సంస్థ తానా ఫౌండేషన్ గుంటూరులో ఫిబ్రవరి 20న నిర్వహించిన మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ విజయవంతమైంది. ప్రపంచంలోనే భారీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల్లో ఒకటైన దీన్ని హైదరాబాద్ కు చెందిన గ్రేస్ ఫౌండేషన్, గుంటూరులోని బైబిల్ మిషన్ భాగస్వామ్యంతో తానా ఫౌండేషన్ విజయవంతంగా నిర్వహించింది. 200మందికిపైగా వైద్యులు, 400మంది నర్స్ లు, ఆరోగ్యసేవల కార్యకర్తలు, ఎందరో వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిబిరంలో ఒకే రోజు మొత్తం 2790 మంది మహిళలు రొమ్ము, సెర్విక్స్ క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకోగా 193 మందికి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. సర్వికల్ క్యాన్సర్ కు సంబంధించిన ఫలితాలు ఇంకా రాలేదని నిర్వాహకులు వెల్లడించారు. ఈ శిబిరాన్ని గిన్నిస్ బుక్ లో నమోదు చేసేందుకు పరిగణనలోకి తీసుకున్నారు.  కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన గ్రేస్ ఫౌండేషన్ కు, వైద్యులు, నర్సులకు తానా ప్రెసిడెంట్ డాక్టర్ చౌదరి జంపాల, తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గోగినేని కృతజ్ఙతలు తెలిపారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించిన ఈ భారీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహణలో పలువురు సహకరించారు. తానా డైరెక్టర్ జయరాం కోమటి, అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు జయ్ తాళ్లూరి, రమాకాంత్ కోయా, త్రిలోక్ కంతేటి, ప్రసాద్ గారపాటి తదితరులు ఆర్థిక, ఇతర సహకారం అందించారు. తానా ఫౌండేషన్ క్యాన్సర్ స్ర్కీనింగ్ కో ఆర్డినేటర్లు అశోక్ బాబు కొల్లా, అనిల్ లింగమనేనిలు నిర్వహణ వ్యవహారాలన్నీ చూసుకున్నారు.

తానా ఫౌండేషన్ పలు సేవాకార్యక్రమాలు చేపడుతోంది. అనాథ బాలల తిండి, చదువు, ఆరోగ్యం కోసం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాల నిర్వహణ, కంటి వైద్య శిబిరాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన నీరంచించడం వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

అమ్మాయిలైతేనేం.. బైక్ రేస్‌లో అద‌ర‌గొట్టారు
మిల్కీ బ్యూటీ రెడీ అయింది

Share this News:

Leave a comment

Your email address will not be published.

*