చిరు నిర్ణయానికి పవన్ అప్ సెట్ అయ్యాడా..?

Share this News:
చిరంజీవి, పవన్ కొంతకాలంగా క్లోజ్ గా ఉంటున్నారు. బ్రూస్ లీ రిలీజ్ అయిన తర్వాత పవన్ వెళ్లి స్వయంగా చిరంజీవిని కలిసారు. అలాగే చిరంజీవి వచ్చి సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో పవన్ ని కలిసారు. చిరు, పవన్ లపై రూమర్స్ పుట్టడానికి ఒకవిధంగా కారణం కూడా ఇదే. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే..? చిరు తీసుకున్న నిర్ణయంతో పవన్ అప్ సెట్ అయ్యాడని ఫిలిం నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. చిరు బీజేపీ పార్టీలో చేరే ఆలోచనే లేదని.. కాంగ్రెస్ లోనే ఉంటానని తేల్చి చెప్పేయడంతో పవన్ అప్ సెట్ అయ్యాడనే మాటలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్..స్వయంగా బీజేపీకు, చిరంజీవి కు మధ్య డీల్ సెట్ చేసారని, ఆయన్ను బీజేపిలోకి ఆహ్వానించాలి అనుకున్నారని.. అయితే ఇప్పుడు చిరంజీవి తాను కాంగ్రేస్ లో కొనసాగుతానని చెప్పేయటం ఆయన ఊహించలేదని చెప్పుకుంటున్నారు. పవన్ అభిమానులు మాత్రం.. అతనేమీ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ కాదని, కేవలం ఆ పార్టీకు సపోర్ట్ మాత్రమే అందించారని చెబుతున్నారు. అంతేనా.. స్వయంగా పవన్ కు జనసేన అనే పార్టీ ఉంది. అంతగా తన అన్నను పిలవాలనుకుంటే కాంగ్రేస్ ని వదిలి జనసేనలోకి రమ్మంటాడు కానీ.. ఇలా బీజేపీలోకి చేరు, తెలుగుదేశంలోకి రా అని అడగవలసిన అవసరం పవన్ కు లేదని చెబుతున్నారు.
రాఘవేంద్రరావు క్లాస్ రూం..!
సృతి ఇరానీ స్పీచ్ ఫుల్ వీడియో

Share this News:

Leave a comment

Your email address will not be published.

*