పవన్ మాట చిరు వింటాడా..?

Share this News:

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఒకరంటే ఒకరికి పడడం లేదని వార్తలు షికారు చేశాయి. అయితే అవసరమైన సమయంలో ఒకరినొకరు కలుసుకుంటూ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే రీసెంట్ గా చిరంజీవి, పవన్ కు ఓ సలహా ఇచ్చినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ వీలైనంత తొందరగా సినిమాలు చేసి 2018 నాటికి సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడని తెలుసుకున్న చిరు, పవన్ ను పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఈ సమయంలో సినిమాలను పక్కన పెట్టాలనుకోవడం సరి కాదని చిరు, పవన్ కు చెప్పాడట. మరి చిరు చెప్పినట్లు పవన్ వింటాడా..? ఒకవేళ వింటే సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కంటిన్యూ అవుతాడా..? లేక 2019 లో ప్రారంభించాలనుకున్న తన ‘జనసేన’ పార్టీను ఇంకాస్త లేట్ గా మొదలుపెడతాడా..? ఈ విషయాలన్నింటికి పవన్ మాత్రమే సమాధానం చెప్పగలడు.

క‌విత ఇలాక‌లో త‌న్నుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌డంలో కొత్త కోణం

Share this News:

Leave a comment

Your email address will not be published.

*