నిహారికకు చరణ్ కాంప్లిమెంట్స్!

Share this News:

నాగబాబు కూతురు నీహారిక.. ‘ముద్దపప్పు ఆవకాయ’ వెబ్ సిరీస్ తెగ ఫేమస్ అయిపోతుంది. ఎంతలా అంటే ఆ వెబ్ సిరీర్ ఎప్పుడు వస్తుందా.. అని ఆడియన్స్ ఎదురుచూసేంత. సంక్రాంతి పండుగ సమయంలో ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్, యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ మూడో ఎపిసోడ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. తెలుగులో ఇదే తొలి వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో నటిస్తోన్న నిహారికను పొగుడుతూ.. తన అన్నయ్య రామ్ చరణ్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

ఈ వెబ్ సిరీస్ లో నిహారిక చాలా అందంగా.. క్యూట్ గా కనిపిస్తోందంటూ, పేస్ బుక్ లో చరణ్ పోస్ట్ చేశాడు. ముద్దపప్పు ఆవకాయని ప్రమోట్ చేయడానికి చరణ్ ఫేస్ బుక్ ని సాధనంగా ఎంచుకున్నారు. ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి నీహారిక నటించిన వెబ్ సీరిస్ లింక్ ఇచ్చారు. అయితే త్వరలోనే బుల్లి తెర నుంచి వెండితెరపై కూడా నిహారిక కనిపించనుంది.

వెంకీ ప‌క్క‌న హీరోయిన్ ఎవ‌రో తెలుసా?
బడ్జెట్లో గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్

Share this News:

1 Comment on నిహారికకు చరణ్ కాంప్లిమెంట్స్!

  1. ante meeru meeru pogudukuntoo vunadandi. nee brucelee cinemani vallu, valla nayana serial seethamahalakshmi serial, muddapappu avakai nu meeru pogadandi.pasalekapoyina okallanu okaru mecchukuni dasari, mohanbabu kutumbalu chankanakipoyyayi. okka bunny mathrame pasunnodu.

Leave a comment

Your email address will not be published.

*