బాబు దూకుడు..జ‌గ‌న్ ను వ‌దిలిపెట్టే ప్ర‌సక్తే లేదు

Share this News:

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఏపీ విపక్ష నేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి స‌భ‌లో చేసిన ఆరోప‌ణ‌ల‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఫైర‌య్యారు. త‌న‌పై, త‌న మంత్రుల‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌పై బాబు ఘాటుగా స్పందించారు. అమ‌రావ‌తిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటూ జ‌గ‌న్ ఆరోపిస్తున్నార‌ని అయితే ఇందులో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఏముందని  బాబు నిల‌దీశారు?  రాజధానికి భూములను భూ సమీకరణ ద్వారా సేకరిస్తే అక్కడ ట్రేడింగ్ ఏముందని చంద్రబాబు ఎదురు ప్ర‌శ్నించారు. భూముల క్రయ విక్రయాలపై ఎటువంటి నిషేధం విధించలేదని చంద్రబాబు చెప్పారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తే వద్దనడానికి మీరెవరు అని చంద్రబాబు నిల‌దీశారు.
రాజధాని భూముల వ్యవహారంలో దమ్ముంటే మంత్రులపై చేసిన ఆరోపణలను జగన్ రుజువు చేయాలని చంద్ర‌బాబు సవాల్ చేశారు. అలా నిరూపించిన ప‌క్షంలో త‌న మంత్రివ‌ర్గంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న మంత్రులు నారాయ‌ణ‌, పుల్లారావుల‌పై చర్య‌లు తీసుకొని వారిని బ‌ర్త‌ర‌ఫ్ చేయిస్తాన‌ని అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అవినీతి పత్రిక పెట్టిన‌ జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబునాయుడు మండిప‌డ్డారు. “సాక్షి ప‌త్రిక‌, టీవీ ఈడీ కేసుల్లో ఉంది. అది ఏపీ ప్ర‌జ‌ల ఆస్తి.స్వాధీనం చేసుకుంటాం. వదిలిపెట్టే ప్రస‌క్తే లేదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ప‌ష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉందని, పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చంద్రబాబునాయుడు వివ‌రించారు. అవసరమైతే పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రానికి అప్పగించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందన్నారు. పోలవరం సహా అన్ని విషయాలపైనా జగన్ అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. జగన్ చేసిన ఆరోపణలు రుజువు చేసిన తరువాతే సభ జరగాలని అన్నారు.

ప్ర‌తిప‌క్షం ఏం సాధించిందంటే…
జ‌గ‌న్ ఫైర్ః బాబు పోజులే త‌ప్ప పనులేవీ?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*