బాహుబలి-2 లో శ్రియ కన్ఫర్మ్ ?

Share this News:
గత కొంతకాలంగా బాహుబలి పార్ట్ 2 సినిమాలో శ్రియ నటించబోతుందనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే అటు శ్రియ కానీ, ఇటు రాజమౌళి కానీ ఈ విషయంపై స్పందించలేదు. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. బాహుబ‌లి మొత్తం స్టార్ల హంగామానే. ఏ సీన్ చూసినా… ఇద్ద‌రు ముగ్గురు స్టార్లు క‌నిపిస్తారు. ఇప్పుడు ఈ స్టార్ లా జాబితాలోకి శ్రియ కూడా చేర‌బోతోంది. రానాకి జోడీగా ఈ ఢిల్లీ భామ క‌నిపించ‌బోతోంద‌ని టాక్‌.
ప్రస్తుతం బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. అక్క‌డే రానా, శ్రియ‌ల‌పై ఫొటో షూట్ నిర్వ‌హించాడ‌ట రాజ‌మౌళి. వీరిద్ద‌రి జోడీకి చిత్ర‌బృందం ఫుల్ మార్కులు ఇచ్చేసింది. దానికి తోడు బాలీవుడ్‌లో అంతో ఇంతో పేరు తెచ్చుకొంది శ్రియ‌. ఆమె బాహుబలి సినిమాలో నటించడం ద్వారా హిందీ వెర్ష‌న్‌కి మ‌రింత గిరాకీ ల‌భిస్తుంద‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో శ్రియ నటించడం కన్ఫర్మ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ నెక్స్ట్ సినిమా ఇదే..!
బే ఏరియా బ‌ర్నింగ్ స్టార్‌కు ప్ర‌శంస‌లు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*