ఖర్మ.. పవన్ కు కూడా స్ట్రాటజీలు అవసరమా?!

Share this News:

సగటు హీరోలతో పోలిస్తే..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీరు చాలా భిన్నం. ఆయన వైఖరి ఒక పట్టాన అర్థం కాదు. మిగిలిన విషయాలు పక్కన పెడితే.. సినీ హీరోలు ఇంటర్వ్యూలు ఇవ్వటం సర్వసాధారణం. కానీ.. పవన్ ఇంటర్వ్యూ ఇవ్వటం చాలా చాలా రేర్. ఇప్పటివరకూ ఆయనిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలు వేళ్ల మీద లెక్కేయొచ్చు. అలాంటి పవన్ కల్యాణ్ ఫిలిం క్రిటిక్ గా పేరున్న అనుపమా చోప్రాకు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.

నిజానికి పవన్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. సదరు ఇంటర్వ్యూలో పవన్ ఏం చెప్పారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. ఇదిలా ఉంటే.. ఇంతమంది తెలుగోళ్లు.. తెలుగు మీడియా సంస్థలు ఉండగా.. వాళ్లను వదిలేసి ముంబయికి చెందిన ఒక క్రిటిక్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వటం ఏమిటన్న ప్రశ్నలు ఒకరిద్దరి నోట వినిపించాయి. అయితే.. వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం జరగలేదు.

కానీ.. తాజాగా చోటు చేసుకున్న ఒకపరిణామం చూసినప్పుడు అనుపమకు పవన్ ఇంటర్వ్యూ ఎందుకిచ్చారో ఇట్టే అర్థమవుతంది. ఆయన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఇప్పటివరకూ తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తారనుకున్నారు. అయితే.. దీన్ని హిందీలో కూడా రిలీజ్ చేయాలని ఇటీవలే డిసైడ్ చేశారు.  తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ ను తెలుగుతో పాటు హిందీలో కూడా ఏప్రిల్ 8న విడుదల చేయనున్నవిషయాన్ని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సర్దార్ రిలీజ్ డేట్ పోస్టర్ ని పోస్ట్ చేశాడు.

ఈ పోస్టర్ ని చూసిన వెంటనే విషయం అర్థం కావటమే కాదు.. ముంబయి క్రిటిక్ కు పవన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారో అర్థమవుతుంది. సినిమా విడుదల నేపథ్యంలో.. ఉత్తరాది వారికి పరిచయం కావటంతో పాటు.. సినిమాకు ప్రమోషన్ కల్పించినట్లు అవుతుందన్న ఉద్దేశంతోనే ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు అర్థమవుతుంది. మరి.. ఇదే పద్ధతిని తెలుగు మీడియాతోనూ పవన్ పాటించొచ్చుగా..?

కొసమెరుపు: మిగతా హీరోలందరూ వేరు మా హీరో వేరు అనే పవన్ అభిమానులు ఏ స్ట్రాటజీలో ఫాలో అవని, అవ్వాల్సిన అవసరం లేని హీరో మా వాడే అని గర్వంగా చెబుతుంటారు. తెలుగులో పవన్ కు స్ట్రాటజీలు అవసరం లేదేమో గాని నార్త్ లో అడుగుపెట్టాలంటే అవసరమే కదా.

కథకళి లేటెస్ట్ ట్రైలర్
కమెడియన్ పై పవన్ ఆగ్రహం!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*