ఆ దర్శకుడిపై చిరు కోపం!

Share this News:

తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి బాహుబలి రికార్డులను సర్దార్ గబ్బర్ సింగ్ బ్రేక్ చేయాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో రకరకాల చర్చలకు దారితీశాయి. ఈ సినిమా ఆడియో వేడుకలో చిరు మాట్లాడుతూ…. రికార్డులు ఉన్నవి బ్రేక్ చేసేందుకే….ఈ సినిమా రికార్డులను మరో సినిమా బ్రేక్ చేస్తే ఆ రికార్డులని మరో సినిమా బ్రేక్ చేయాలనీ చెప్పాడు. బాహుబలి రికార్డ్ ని ఏ సినిమాకి అయినా క్రాస్ చేయడం కష్టం.

అందుకే ఆ రికార్డులని సర్దార్ క్రాస్ చేయాలనీ పరోక్షంగా బహుబలిపై ఆయన సెటైర్స్ వేశాడని పలువురు చర్చించుకుంటున్నారు. రాజమౌళి, చిరుకు మధ్య ఉన్న గొడవ గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. గతంలో చిరు 150వ సినిమాను డైరెక్ట్ చేయాలనీ అల్లు అరవింద్ ను చిరు రాజమౌళి వద్దకు పంపితే చిరుకి సరిపోయే కథ తన వద్ద లేదని, ఈ ఆఫర్ ని రాజమౌళి రిజెక్ట్ చేశాడట. తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ తో భవిష్యత్తులో రాజమౌళి చరణ్ తో సినిమా చేయడం కష్టమన్న టాక్ కూడా వినిపిస్తుంది.

మోహన్ లాల్ బాగా ప్లాన్ చేశాడు!
మెగా బ్రదర్స్ సెల్ఫీ ఐడియా ఆయనదేనా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*