హిందువులే ల‌క్ష్యంగా ఎంఐఎం కొత్త వివాదం

Share this News:
‘భారత్ మాతాకీ జై’ అనే నినాదంపై వివాదం ముదురుతోంది.  ఇందుకు వ్యతిరేకంగా ‘హిందుస్థాన్ జిందాబాద్’ పేరిట పాతనగరంలో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. పైగా మజ్లిస్ పార్టీ ముఖ్య నేతల ఫొటోలతో కూడిన ఈ పోస్టర్లను ఆ పార్టీ కార్యకర్తలు న‌గ‌రం నాయకులు అంతటా అతికించారు. భారత్ మాతాకీ జై..నినాదాన్ని చేయబోమని తొలుత మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఘంటాపథంగా చెప్పిన సంగతి తెలిసిందే. హెచ్‌సీయూను సందర్శించిన జేఎన్‌యు నాయకుడు కన్హయ్య కూడా మతం ముసుగులో కుట్ర జరుగుతున్నదని, సమానత్వమే తన ఆశయమని పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు యునైటెడ్ ముస్లిం ఫోరం అధ్యక్షుడు మునీరుద్దీన్ ముఖ్తార్ అధ్యక్షతన 11 ముస్లిం సంఘాల నాయకులు సమావేశమై భారత్ మాతాకీ జై అనే నినాదం చేయరాదని, హిందుస్థాన్ జిందాబాద్ నినాదం చేయడంలో తప్పేమి లేదని అభిప్రాయపడ్డారు. హిందుస్థాన్ జిందాబాద్ నినాదం చేయాలని తీర్మానించారు.
 భారత్ మాతాకీ జై అన్న నినాదాన్ని ముస్లింలెవ్వరూ చేయరని యునైటెడ్ ముస్లిం ఫోరం తాజాగా ఓ తీర్మానం ఆమోదించింది. ఆ నినాదం చేసేందుకు ‘ఇస్లాం’ అంగీకరించదని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. ఇదిలాఉండగా హిందుస్థాన్ పేరిట, మజ్లిస్ నేతల నిలువెత్తు ఫొటోలతో భారీగా కటౌట్లు వెలవడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. అందునా శుక్రవారం కావడం, గుడ్‌ఫ్రై-డే సెలవు రోజు కావడంతో నగరంలోని అన్ని మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదుకు మధ్యాహ్నం నమాజ్ చేసేందుకు వందల సంఖ్యలో ముస్లింలు వచ్చారు. నమాజ్ ముగిసిన తర్వాత హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తారేమో, ఫలితంగా ఉద్రిక్తతలకు దారి తీస్తుందేమో, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమోనన్న అనుమానాలు అధికారుల్లో తలెత్తాయి. దాంతో అనేక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కానీ ఎటువంటి ఘటనలు జరగకుండా సాఫీగా నమాజ్ ముగిసింది.
ఇదిలాఉండగా యునైటెడ్ ముస్లిం ఫోరం అధ్యక్షుడు మునీరుద్దీన్ ముఖ్తార్ మాట్లాడుతూ ‘అల్లా’ ఒక్కరే కాబట్టి, మరో దేవత గురించి నినాదం చేయడానికి ‘ఇస్లాం’ (షరియత్) అంగీకరించదని చెప్పారు. భారత్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అనడంలో తప్పేమీ లేదని అన్నారు. ‘హిందుస్థాన్’ పదంలో కూడా హిందువులు అనే భావం ఉంది కదా? అని ప్రశ్నించగా, ‘హిందువులు మా సోదరులు’ కాబట్టి హిందుస్థాన్ అనడంలో తప్పేమీ లేదని ఆయన తెలిపారు. ఒక నినాదం చేయాలని పరమతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీయడం సమంజసం కాదని అన్నారు.
నెహ్రూ మాట‌ల మ‌ర్మ‌మేంటి?
మోడీ చేయ‌లేనిది కేసీఆర్ చేయ‌గ‌ల‌డా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*