మోక్షజ్ఞ సవాల్!

Share this News:

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్లుగా బాలకృష్ణ, మోక్షజ్ఞ ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. దీంతో మోక్షజ్ఞ ప్రస్తుతం ఉన్న యువ హీరోలందరికీ పోటీగా మారడం ఖాయమని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇండియా టుడే మ్యాగజైన్ నందమూరి బాలకృష్ణపై ఓ ప్రత్యేక ఎడిషన్ ను ప్రచురించిన విషయం తెలిసిందే.

ఈ ఎడిషన్ లో బాలకృష్ణ సినీ, రాజకీయ జీవిత విశేషాలను ఎన్నింటినో వివరించింది. ఇందులో భాగంగా మోక్షజ్ఞ , తన తండ్రి గురించిన చెప్పిన విశేషాలు హాట్ టాపిక్ గా మారాయి. బాలకృష్ణ తనను ఒక కొడుకులా కంటే.. ఓ మంచి స్నేహితుడిలా ఉంటారని చెప్పాడు. ఏ విషయంలోనూ తనపై ఒత్తిడి తీసుకురాలేదని తన కెరియర్ కి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. తన తండ్రి, తాతయ్యల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అభిమానుల అంచనాలను అందుకుంటానని ఎంతో నమ్మకంతో తెలియజేశాడు.

బిడ్డను కన్నాక.. వీర్యదాతను వెతికి పెళ్లాడింది
పవన్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా..?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*