కూతురితో ఆ స్టెప్పులేంటి చిరూ..

Share this News:

కూతురి పెళ్లి వేడుకలో తండ్రి స్టెప్పులేయడం తప్పేమీ కాదు. ఐతే ఆ డ్యాన్సులేసేటపుడు ఏ పాట ఎంచుకున్నాం.. ఎవరితో కలిసి డ్యాన్సులేస్తున్నాం అన్నది కాస్త చూసుకోవాలి. ఐతే మెగాస్టార్ చిరంజీవి మాత్రం చిత్రంగా ఓ ప్రణయ గీతానికి తన కూతురు శ్రీజతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిరు కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోయే పాట.. ‘మరణమృదంగం’లోని మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. శ్రీజ పెళ్లి సందర్భంగా నిర్వహించిన మెహందీ వేడుకలో చిరు ఈ పాటకు డ్యాన్స్ చేశాడు.

ఐతే ఆయన పక్కన భార్య సురేఖో లేదంటే ఇంకెవరైనా లేడీనో ఉంటే ఇబ్బంది లేకపోయేది. ఐతే చిరు మాత్రం ఈ పాటకు శ్రీజతో కలిసి డ్యాన్స్ చేయడం చూసేవాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తోంది. చిరు కుటుంబ సభ్యులు బాగానే ఎంకరేజ్ చేశారు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో విషయంలో నెగెటివ్ కామెంట్లే పడుతున్నాయి. ఓ ప్రణయ గీతానికి తండ్రీ కూతుళ్లు కలిసి డ్యాన్స్ చేయడమేంటి.. చిరు ఇలా చేశాడేంటి అని కామెంట్లు చేస్తున్నారు.

కొసమెరుపు: కొందరు ఆ వీడియోలో ఉన్నది శ్రీజ కాదు, చిరు పెద్ద కూతురు అంటున్నారు. ఎవరైతే ఏంటి కూతురే కదా!

అక్కడ బార్ డ్యాన్సర్లను టచ్ చేస్తే అంతే..
వైరల్ : శ్రీజ పెళ్లి వీడియో !

Share this News:

2 Comments on కూతురితో ఆ స్టెప్పులేంటి చిరూ..

  1. Pervert

  2. anduke ekkada paniki rakunda poyadu.

Leave a comment

Your email address will not be published.

*