గ్యారేజీలో సెట్స్ లో నరేష్ హీరోయిన్!

Share this News:
‘అత్తిలి సత్తిబాబు’, ‘దేవరాయ’ చిత్రాల్లో హీరోయిన్ గా నతీంచిన విదిశకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పేరేం రాలేదు. దీంతో ఈ భామ ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్ళిపోయింది. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత మరోసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న.. ‘జనత గ్యారేజ్’ సినిమా ద్వారా. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో ఆమె మళయాళి నటుడు ఉన్ని ముకుందన్ సరసన నటించనుంది.
ఎన్టీఆర్ కు అక్క పాత్రలో విదిశ కనిపించనుందని సమాచారం. తను హీరోయిన్ గా చేయకపోయినా.. ఎన్టీఆర్, మోహన్ లాల్ వంటి స్టార్స్ నటిస్తున్న చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చెప్తోందీ నటి. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోన్న షెడ్యూల్ లో విదిశ పాల్గొంటుంది.  ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్లో షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందో అని తన అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మెగా కుటుంబంతో పవన్ భార్య గ్రూప్ ఫొటో
ఇలియానా బంపర్ ఆఫర్ ఇచ్చేసింది

Share this News:

Leave a comment

Your email address will not be published.

*