బాలయ్య నిర్మాత తప్పుకున్నాడు!

Share this News:
నందమూరి బాలకృష్ణ తన 100 వ చిత్రం కోసం దర్శకుడు క్రిష్ తో కలిసి పని చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాలని క్రిష్ భావించాడు. ఈ చిత్రానికి ‘యోధుడు’ అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు. అయితే సుమారుగా డెబ్బై కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించాడు క్రిష్. కాని బాలయ్యపై అంత పెట్టుబడి పెట్టలేక నిర్మాత తప్పుకున్నాడని సమాచారం.
బాలయ్యతో ‘లెజెండ్’ సినిమాను నిర్మించిన సాయి కొర్రపాటి తన 100వ చిత్రాన్ని కూడా నిర్మిస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే సాయి కొర్రపాటి మాత్రం సున్నితంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. లెజెండ్ సినిమా 38 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. డెబ్బై కోట్లు అంటే బాలయ్య మార్కెట్ కు మించి ఖర్చుపెట్టడమే అని ఆలోచించిన సాయి కొర్రపాటి తనపై ఇంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అని భావించాడు. ఇదే నిజమైతే బాలయ్యే స్వయంగా తన 100 వ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సర్దార్ గబ్బర్ సింగ్ లా ఎంపీ మల్లారెడ్డి
నూటొక్క కోట్లతో నాటవుట్ గా మొబైల్ ఇండియా

Share this News:

Leave a comment

Your email address will not be published.

*