సర్దార్ సినిమాకు వెళ్లి వేలు పోగొట్టుకున్నాడు

Share this News:

సర్దార్ సినిమా విడుదల సంగతేమో కానీ.. ఉరకలేసే అభిమానుల ఉత్సాహం కొన్నిచోట్ల అత్యుత్సాహంగా మారింది. తమ అభిమాన హీరో సినిమా చూసేయాలన్న ఆత్రుత అనుకోని ప్రమాదాల్ని తెచ్చి పెట్టింది. తమ అభిమాన నటుడి సినిమాను మొదటిరోజునే చూసేయాలన్న ఆత్రుత ఒక అభిమాని వేలు పోగొట్టుకునేలా చేసింది. అందరిని షాక్ కు గురి చేసిన ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురం విష్ణు థియేటర్ వద్ద చోటు చేసుకుంది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు.

టిక్కెట్ల కోసం ఆత్రుత పెరిగింది. టిక్కెట్లు ఇచ్చేందుకు గేట్లు తెరవకపోవటంతో.. ఉత్సాహంతో ఉరకలెత్తే ఫ్యాన్స్ వెనుకా ముందు చూసుకోకుండా థియేటర్ గేటు ఎక్కే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఒక యువకుడు థియేటర్ గేటు ఎక్కటం.. అదే సమయంలో థియేటర్ సిబ్బంది గేటు తీసే ప్రయత్నం చేశారు. ఈ హడావుడిలో గేటు ఇనుప చువ్వల్లో వేలు ఇరుక్కు పోయింది. కళ్లు మూసి కళ్లు తెరిచే లోపల వేలు కట్ అయి కింద పడి పోయింది.

దీంతో అటు సిబ్బంది.. చుట్టూ ఉన్న వారు షాక్ తిన్న పరిస్థితి. దీంతో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఆ యువకుడికి వైద్య సాయం అందించేందుకు ప్రయత్నించేంతలో భయపడిన యువకుడు పారిపోయాడు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని.. షో టైంకు దగ్గర పడుతున్నా గేటు తీయకుండా ఉండటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అమెరికా తెలుగు సంఘాల ఆశ్చ‌ర్య‌పోయే ప్ర‌తిపాద‌న 
బే ఏరియాలో:  రాగ ల‌హ‌రి- ఎస్ ఎస్ థ‌మ‌న్ లైవ్ క‌న్స‌ర్ట్‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*