మ‌ళ్లీ కేసీఆర్‌ను క‌లిసిన బాల‌కృష్ణ‌ 

Share this News:
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుతో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. క్యాంపు కార్యాల‌యంలో సీఎం కేసీఆర్‌ను క‌లిసిన బాల‌కృష్ణ‌ త‌మ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలోని బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రిలో భవనం క్రమబద్ధీకరణకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన తదుపరి చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ముహూర్త కార్యక్రమానికి హాజరు కావాలని కేసీఆర్‌ను బాలకృష్ణ కోరారు.
ఈ నెల 22న బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ముహుర్తపు సన్నివేశం జరగనుంది. బాలకృష్ణ వెంట‌ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న వందో చిత్రం విశేషాల‌ను బాల‌య్య సీఎం కేసీఆర్‌కు వివ‌రించారు.
పాలేరులో పాతకాపుల బిగ్ ఫైట్?
ఆ ఇల్లు నా కష్టార్జితం అంటున్న రకుల్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*