ఆ ఇల్లు నా కష్టార్జితం అంటున్న రకుల్

Share this News:
బాలీవుడ్లో కొందరు బడా హీరోలు హీరోయిన్లను తమదైన శైలిలో ఆదరిస్తుంటారు. ఫ్లాట్లు.. కార్లు లాంటి ఖరీదైన కానుకలు ఇస్తుంటారు. టాలీవుడ్లో కూడా ఇలాంటి వ్యవహారాల గురించి అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా అలాగే ఓ ఫ్లాట్ కానుకగా అందిందంటూ కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ మాట రకుల్ చెవిన కూడా పడటంతో దీని గురించి మీడియా వాళ్లకు క్రిస్టల్ క్లియర్ గా వివరణ ఇచ్చేసింది.
‘‘నా సంపాదనతో హైదరాబాద్‌లో ఓ కారు కొనుకున్నా. ఆ తర్వాత నేను కొన్న గొప్ప వస్తువు ఇల్లే. రూపాయి రూపాయి కూడబెట్టుకుని నా కష్టార్జితంతో సంపాదించిన ఈ ఇంటిని ఇంకెవరో హీరో నాకు ఇచ్చారంటే బాధ అనిపించింది. మా నాన్నే దీని గురించి పేపర్లలో చదివి నాకు చెప్పారు. ‘ఆ ఇల్లు కొనేటప్పుడు నేను కూడా ఉన్నా కదా. ఇలాంటివి పట్టించుకోవద్దు’ అంటూ ధైర్యం చెప్పారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఆ ఇల్లు కొనడానికి మా నాన్న బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు. దీని గురించి మా నాన్నే మీడియాకు అన్నీ వివరించాలేమో’’ అని రకుల్ చెప్పింది.
ఇక మెగా ఫ్యామిలీ హీరోలనగానే తనకు స్పెషల్ ఇంట్రెస్ట్ అని.. వాళ్లతో అవకాశం వస్తే తాను పారితోషకం కూడా తగ్గించుకుని ఓకే చెప్పేస్తానని మీడియాలో వస్తున్న వార్తల గురించి రకుల్ స్పందిస్తూ.. ‘‘మెగా ఫ్యామిలీ హీరోలతో వరుసగా అవకాశాలు రావడం యాదృచ్ఛికం. కేవలం మెగా హీరో అనే కారణంగా  సాయిధరమ్ తేజ్ సరసన చేయనున్న చిత్రం కోసం పారితోషికం తగ్గించుకున్నానని  రాశారు. అసలు ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇక ఇలాంటి వాటిని పట్టించుకోవడం అనవసరం’’ అని చెప్పిందామె.
మ‌ళ్లీ కేసీఆర్‌ను క‌లిసిన బాల‌కృష్ణ‌ 
న్యూయార్క్ లో ఆ ఇద్దరూ గెలిచారు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*