ఎన్టీఆర్ మా నాయకుడు.. కేసీఆర్

Share this News:

టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రంతో సినీ, రాజకీయ ఉద్ధండులను ఒక్కచోట చేర్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు… మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి, రాఘవేంద్రరావు వంటి ఉద్ధండుల సమక్షంలో తన 100 చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ముహూర్తపు షాట్ తీశారాయన. ఈ సందర్భంగా  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ ఊహించని విధంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు వెళ్లినా అన్నగారి పేరు తెలుస్తందంటూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.  తన ప్రసంగం యావత్తు ఎన్టీఆర్ ను పదేపదే తలచుకున్నారు. ఎన్టీఆర్ మా నాయకుడు అని కూడా అనడంతో అక్కడ హర్షధ్వానాలు వినిపించాయి.

ఎన్టీఆర్ జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అని కేసీఆర్ అన్నారు.  నందమూరి బాలకృష్ణ తన అభిమాన నటుడని చెప్పిన కేసీఆర్ ఈ చిత్రం పూర్తయిన తరువాత తన అభిమాన నటుడితో కలిసి ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నానని… ఈ సినిమా చూసే మొదటి బ్యాచ్ లో బాలయ్య తనకు అవకాశం కల్పించాలని కోరుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్నారు.

ఇటీవల హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన సమయంలో తమ ప్రభుత్వంపై కొందరు దుష్ప్రచారం చేశారని.. ఎన్టీఆర్ గార్డెన్సు పేరు మారుస్తారంటూ, ఎన్టీఆర్ ఘాట్ ను తరలిస్తారని లేనిపోని ప్రచారాలకు తెర తీశారని…  అలాంటి ఆలోచన కూడా తనకు రాదని అన్నారు. హైదరాబాద్ లోని అన్నగారు నందమూరి తారకరామారావు ఘాట్ ను తరలించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పార్కు పేరు మార్చేది లేదని స్పష్టంగా ప్రకటించారు.

తాను ఎన్టీఆర్ విరాభిమానినని, ఎన్టీఆర్ గార్డెన్స్ అలాగే నిలుస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. మదరాసీలుగా పిలవబడుతున్న వారిని తెలుగువారుగా మార్చిన ఘనత ఆయనదేనని అన్నారు. “మా నాయకుడు ఎన్టీ రామారావు గారు. తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్డ.  హైదరాబాద్ లో ఉన్నటు వంటి ఎన్టీఆర్ గార్డెన్స్  చిరస్థాయిగా ఎన్టీఆర్ గార్డెన్స్ గానే ఉంటుంది.  ఎన్టీ రామారావు గారు ఒక తరం నటుడు కాదు. జాతి గర్వించదగ్గ బిడ్డ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు పోయినా ఎన్టీఆర్ గారు తెలియని వారు లేరు. కాబట్టి అంత మహా నాయకుడు, అంతటి గొప్ప వ్యక్తి స్మారక చిహ్నం ఏదైనా గుండెల్లో పెట్టుకు చూసుకుంటాం” అన్నారు.

పార్టీలో అసంతృఫ్తిని ప‌సిగ‌ట్టిన కేసీఆర్‌
‘సరైనోడు’ రివ్యూ

Share this News:

Leave a comment

Your email address will not be published.

*