బొద్దుగుమ్మ న‌మిత ఆ పార్టీలో చేరిపోయింది

Share this News:

గతంలో ఇటు తెలుగు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అంద చందాలతో ఒక ఊపు ఊపిన నమిత మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. తెలుగు సినిమాల తరువాత కొన్ని రోజులు ఆడపాదడపా సినిమాలు చేస్తూ…కాస్త లావై ఆ రకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మరోరకంగా తన క్రేజ్‌ను మరింత పెంచుకునే పనిలో పడింది. త‌మిళ‌నాడులో అధికార‌ప‌క్ష‌మైన‌ అన్నాడీఎంకే పార్టీలో చేరి రాజ‌కీయంలోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.

తిరుచ్చిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షురాలు జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంత‌కుముందురోజు తనకు అన్నాడీఎంకే పార్టీలో చేరాలని ఉందని, ఆ మేరకు అవకాశం కల్పించాలని జయలలితకు నమిత లేఖ రాశారు. అందుకు జయలలిత సుముఖత వ్యక్తం చేశారు. దీంతో తిరుచ్చి వెళ్లిన నమిత.. అక్కడ అన్నాడీఎంకే సభ్యత్వం తీసుకున్నారు. నమిత మాట్లాడుతూ.. జయలలిత తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారని, పరిపాలన బాగుండటంతో తాను అన్నాడీఏంకేలో చేరుతున్నానని చెప్పారు. పార్టీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు.

షాక్ ఇస్తున్న టీఆర్ఎస్ ప్లీన‌రీ ఆహ్వానం
షాక్‌..షాక్‌..షాక్‌: జ‌గ‌న్‌కు ఎన్ని షాకులో

Share this News:

Leave a comment

Your email address will not be published.

*