‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రిలీజ్ డేట్ కన్ ఫర్మ్!

Share this News:

బాలయ్య వందో సినిమా రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ అయింది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి.. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈరోజు మంచి రోజు కావడంతో ఈ సినిమా విడుదల తేదీని దర్శకుడు క్రిష్ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఆయన చెప్పారు. మొరాకోలో వచ్చేనెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. అక్కడే సినిమాకు సంబంధించిన ప్రధాన ఘట్టాలన్నీ చిత్రీకరించాలని దర్శకుడు భావిస్తున్నాడు.

బాలకృష్ణ సరసన ప్రగ్యాజైశ్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హేమమాలని బాలయ్య తల్లిగా నటిస్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. శాలివాహన శకానికి మూల పురుషుడైన శాలివాహన రాజుల్లో 23వ రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య టైటిల్ పాత్రకోసం ఇప్పటికే తన గెటప్ ను మార్చేశారు. షూటింగ్ కు వెళ్లడమే తరువాయి. కంచె లాంటి భిన్నమైన కథను తెరక్కెకించిన క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు.

బాబుపై మ‌ళ్లీ గాండ్రింపులు మొద‌ల‌య్యాయి
రామోజీ భగీరథ ప్రయత్నం రామన్ మెగససే కోసమా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*