బాబుపై మ‌ళ్లీ గాండ్రింపులు మొద‌ల‌య్యాయి

Share this News:

తాత్కాలికంగా స‌ద్దుమ‌ణిగిన కాపు ఉద్య‌మం మ‌రోమారు రాజుకుంటోందా?  హామీలు నెర‌వేర్చ‌క‌పోతే పోరాటం ఖాయ‌మ‌ని చెప్పిన‌ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇపుడు ఆ మాట‌కు క‌ట్టుబ‌డి పోరాట కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకున్నారా? అంటే కాపు నేత తాజా ప్ర‌క‌ట‌న‌తో అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

విశాఖ‌కు ప్రత్యేక రైల్వేజోన్‌ కోసం ఉద్య‌మించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్‌ను ఆయ‌న నివాసంలో ముద్ర‌గ‌డ‌ ప‌రామ‌ర్శించారు. అనంత‌రం అమ‌ర్‌నాథ్‌ గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రైల్వేజోన్ కోసం అమర్‌నాథ్ నిరాహారదీక్ష సమయంలో తాను వస్తే రాజకీయం అవుతుందని చెప్పి, ఇప్పుడు పరామర్శించేందుకు వచ్చానని ప‌ద్మ‌నాభం తెలిపారు. కాపు సామాజిక తరగతికి సంబంధించి చాలా మందికి రుణాలను ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆరోపించారు. విద్యార్థులకు పరీక్షలు ఉండడం వల్ల తాను చేపట్టబోయే ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశానని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణ చేపట్టి మరలా దీక్షలో కూర్చుంటానని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు సామాజిక తరగతికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, అందుకే సీఎం గుండె అదిరేలా ఉద్యమాలు చేపట్టనున్నట్లు  అన్నారు. దీనికి సంబంధించి తాను త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.  ప్రభుత్వం తనను అరెస్టు చేసినా బెయిలుకు కూడా దరఖాస్తు పెట్టుకోనని ప్ర‌క‌టించారు.  కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేసేందుకు త్వ‌ర‌లో ప్రాంతాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తానని అన్నారు.

కాపు రుణాల విష‌యంలో ఆశించిన వారంద‌రికీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున రుణాలు అంద‌క‌పోవ‌డంతో ప‌లు వ‌ర్గాల్లో అసంతృఫ్తి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో తెర‌మీదు వ‌చ్చిన అసంతృప్తి అండ‌గా ఉద్య‌మించాల‌ని ముద్ర‌గ‌డ భావిస్తున్నార‌ని తెలుగుదేశం వ‌ర్గాలు సందేహం వ్య‌క్తం చేస్తున్నాయి. కాపుల కోసం తామేం చేశామ‌నేది వివ‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ఆ వ‌ర్గాలు వివ‌రిస్తున్నాయి.

ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రిలీజ్ డేట్ కన్ ఫర్మ్!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*