రామోజీ భగీరథ ప్రయత్నం రామన్ మెగససే కోసమా?

Share this News:

సుదీర్ఘమైన బిజినెస్ కెరీర్ లో వ్యాపార ప్రయోజనాలే తప్ప వ్యక్తిగత భూషణాల కోసం ఎన్నడూ ప్రయత్నించని మీడియా మొఘల్ రామోజీరావు తీరులో ఇటీవల కాలంలో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా పాలకులు, ప్రముఖులకు దగ్గరగా మెలగుతూ… కొందరికి రాజకీయ గురువుగా వ్యవహరిస్తూ.. రాజకీయాలనే మార్చగలిగే సత్తా ఉన్న వ్యక్తిగా నిరూపించుకున్న రామోజీ ఏనాడూ పదవులు, పురస్కారాల కోసం ఆశించలేదు. వాటి జోలికెళ్లలేదు. తనను వెతుక్కుంటే అవే వచ్చినా తిరస్కరించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, విచిత్రంగా గత కొద్దికాలంగా ఆయన పురస్కారాల కోసం పరుగులు తీస్తున్నట్లుగా కనిపిస్తోంది. పండిట్ రవిశంకర్ గురూజీ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవడం నుంచి మొదలైన ఆయన పురస్కారాల కోరిక ఇప్పుడు పీక్ స్టేజికి చేరుకుందని చెబుతున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఇంకుడు గుంతల పేరుతో ఈనాడు ఉద్యోగులను వాడుకుని తాను భారీ అవార్డుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

కేంద్రంలో యూపీయే పాలన ముగిసి మోడీ కుర్చీ ఎక్కగానే రామోజీ జూలు విదిల్చారు. మోడీ కలల ప్రోగ్రాం అయిన స్వచ్ఛభారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన తన ఈనాడు బలగం సాయంతో స్వచ్ఛభారత్ షోను పెద్ద ఎత్తున చేపట్టారు. తన పత్రిక, టీవీల్లో దానికి పాపులారిటీ ఇవ్వడమే కాకుండా మొత్తం చేపట్టిన కార్యక్రమాలన్నీ భారీ ఆల్బమ్ గా రూపొందించి దాన్ని మోడీ ముందు పెట్టారు. పనిలో పనిగా మనసులోని కోరికనూ బయటపెట్టారు. దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ను అందుకున్నారు.

తాజాగా రామోజీ భూగర్భ జల సంరక్షణ కోసమంటూ ఇంకుడు గుంతలు తవ్వించే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు. తన మీడియా వ్యవస్థను ఉపయోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటికీ గోతులు తవ్వించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది కూడా ఫొటోలు, వీడియోల రూపంలో మొత్తం రికార్డవుతోంది. దీంతో రామోజీ మరో అవార్డు కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నీటి సంరక్షణ పేరుతో ఆయన రామన్ మెగససే అవార్డుకు గురి పెట్టారని కొందరు అంటుంటే.. అదేమీ కాదు.. ఏకంగా భారత రత్నను టార్గెట్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఈనాడు, ఈటీవీ సిబ్బందిని భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తున్న రామోజీ ఊరికే ఇదంతా చేస్తున్నారని ఎవరూ అనుకోరు. అయితే.. అది రామన్ మెగసెసే కోసమా.. భారత రత్న కోసమా లేదంటే ఇంకేదైనా టార్గెట్ ఉందా అన్న చర్చ మీడియాలో వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంంది.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రిలీజ్ డేట్ కన్ ఫర్మ్!
బాబు సర్కారు మీద నిందేసిన కేంద్రమంత్రి

Share this News:

Leave a comment

Your email address will not be published.

*