ఒబామా చాలా ఫన్నీ: బాలీవుడ్ భామ

Share this News:

వయసు పెరుగుతుంటే అందం తగ్గటం కామన్. కానీ.. బాలీవుడ్ భామ ప్రియాంక విషయంలో అది కాస్త భిన్నం. అమ్మడి వయసు పెరుగుతున్న ఆకర్షణ రోజురోజుకీ పెరిగిపోతోంది. బాలీవుడ్ నుంచి ఈ మధ్యనే హాలీవుడ్ కి ఎక్స్ పోర్ట్ కావటమే కాదు.. అక్కడ కూడా తన హాట్ అందాలతో ఇప్పటికే వేడెక్కిస్తున్న ఈ భామ పేరు ప్రఖ్యాతలు రోజురోజుకీ విస్తరిస్తున్నాయి.  తాజాగా అమ్మడు ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్వహించిన 2016 వైట్ హౌస్ లో నిర్వహించిన ఒక విందుకు ప్రియాంకను కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఊహించని ఈ ఇన్విటేషన్ కు ఉక్కిరిబిక్కిరి అయిన అమ్మడు తాజాగా ఈ విందుకు హాజరైంది. ఒబామా దంపతులతో కలిసి విందు చేసిన ఆమె.. వారితో కలిసి ఫోటోలు దిగింది. వైట్ హౌస్ లో తన డిన్నర్ గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ..  ఒబామా దంపతుల్ని విపరీతంగా పొగిడేసింది. ఒబామా చాలా ఫన్నీ అని.. చాలామంచి వారని ఆమె చెప్పుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు అంతటివాడు పిలిచి మరీ భోజనం పెట్టి.. నవ్వుతూ మాట్లాడితే మంచోడు కాకుండా చెడ్డోడు అవుతాడా ఏంటి?

`మిష‌న్ కాక‌తీయ`లో దిమ్మ‌తిరిగే నిజాలు
పవన్ పై వర్మ సంచలన ట్వీట్స్ చదివారా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*