“గౌతమిపుత్ర శాతకర్ణి”- అభిమాన గీతమే అదిరింది

Share this News:

శరవేగంగా వందో చిత్రానికి చేరుకున్న బాలయ్య అంతేవేగంగా ఆ సినిమా ను మొదలుపెట్టేశారు. అంతేకాదు, ఒక విచిత్రమైన కాంబినేషన్ తో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. మొన్ననే కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమా టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇది అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” కి గౌరవసూచకంగా గీతరచయిత సిరాశ్రీ, సంగీత దర్శకులు రవిశంకర్ సంయుక్తంగా రూపొందించిన ఒక గీతాన్ని నేడు విడుదల చేసారు.
“ఈ చిత్రం ప్రకటన వినగానే గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన “ఆంధ్రప్రశస్తి” చదివాను. వెంటనే పాట వ్రాయాలని స్ఫూర్తి కలిగింది. రాసిన వెంటనే అదే స్ఫూర్తితో “కిల్లింగ్ వీరప్పన్”, “ఎటాక్” చిత్రాలకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ అద్భుతంగా స్వరపరిచారు. ఈ పాటను కేవలం ఫ్యాన్ మేడ్ గా విడుదల చేసిందే తప్ప, దీనికి నందమూరి బాలకృష్ణ- దర్శకులు క్రిష్ గార్ల చిత్రానికి ఎటువంటి సంబంధమూ లేదని సిరాశ్రీ తెలిపారు.

బలమైన ప్రతిపక్షం కావలెను!!
బ్రహ్మోత్సవం ఆటాపాట అదిరింది

Share this News:

Leave a comment

Your email address will not be published.

*