బ్రహ్మోత్సవం కోసం అన్ని సెట్టింగులా?

Share this News:

టాలీవుడ్లో సెట్టింగ్స్ అనగానే గుణశేఖర్ సినిమాలు గుర్తుకొస్తాయి. అవసరమున్నా లేకున్నా సెట్టింగ్స్ వేయించడం.. వాటిలోనే షూటింగులు చేయించడం గుణశేఖర్ కు బాగా అలవాటు. ఆయన సినిమాల కోసం లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఎన్నో భారీ సెట్టింగులు వేశారు. అందులో కొన్ని తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ‘చూడాలని ఉంది’లో కలకత్తా సెట్.. ‘అర్జున్’లో మధుర మీనాక్షి సెట్టింగ్స్ ఈ జాబితాలో ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పుడు గుణశేఖర్ కొంచెం స్లో అయిపోవడంతో తోట తరణి పేరు పెద్దగా వినిపించట్లేదు. ఐతే ఆ పెద్దాయన సేవల్ని గుణ తర్వాత అంత బాగా ఉపయోగించుకున్నది శ్రీకాంత్ అడ్డాలే అని చెప్పాలి. ‘బ్రహ్మోత్సవం’ సినిమా కోసం తరణి ఏకంగా 15 భారీ సెట్టింగ్స్ వేశారని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. క్వాలిటీ.. రిచ్ నెస్ విషయంలో ఏమాత్రం రాజీ పడని పీవీపీ లాంటి నిర్మాత దొరకడంతో శ్రీకాంత్.. తరణి.. ఏమాత్రం వెనక్కి తగ్గాల్సి పని లేకపోయింది. కేవలం సెట్టింగ్స్ కోసమే కొన్ని కోట్ల బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించడంతో తరణి తన సృజనాత్మకతకు హద్దులేమీ పెట్టుకోకుండా భారీ లెవెల్లో సెట్టింగులు వేశారట.

‘‘తొమ్మిది నెలల వ్యవధిలో 15 భారీ సెట్టింగ్స్ వేశాం. వీటిలో దేనికదే భిన్నమైంది. అన్నింట్లోకి మండువా ఇల్లు.. టెర్రస్ చాలా బాగా నచ్చాయి. సెట్టింగ్స్ ఏవీ కూడా సెట్టింగ్స్ అనిపించకుండా నిజమైనవే అనిపించేలా సహజంగా.. అందంగా తీర్చిదిద్దాం. ఇందులో హీరోకు రంగులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ విషయాన్ని కూడా సెట్టింగ్స్ ద్వారా చూపించాం. ఇంట్లో అక్కడక్కడా కలర్ ప్యాలెట్స్ పెట్టాం. మహేష్ తండ్రిగా నటించిన సత్యరాజ్ గది చూస్తే పాత కాలపు రోజుల్లోకి వెళ్లిపోతాం. మహేష్ గది ఈ తరానికి తగ్గట్లు మోడర్న్ గా కనిపిస్తుంది. ఈ ఇంటి సెట్ కోసం 25 రోజులు పట్టింది. వందలమంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి ఈ సెట్ తయారు చేశారు. మిగతా సెట్టింగ్స్ వారానికొకటి వేశాం. విజయవాడ దుర్గగుడి.. తిరుమల వేంకటేశ్వరుని గుడిని పోలిన సెట్టింగ్స్ కూడా వేశాం. అవి చూస్తే నేరుగా అక్కడికే వెళ్లి షూటింగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కాశీలో తీసిన ఫీలింగ్ కలిగించే ఓ సెట్టింగ్.. నాగ్ పూర్ గ్రామీణ నేపథ్యంలో ఓ గుడిసె సెట్టింగ్ కూడా వేశాం. నా కెరీర్లో అత్యంత సంతృప్తి కలిగించిన సినిమాల్లో బ్రహ్మోత్సవం ఒకటి’’ అని తరణి చెప్పారు.

నాగశౌర్యకు ఆ రెండు కలిసొస్తున్నాయి
న‌టోమాస్ గ్రూప్ మాతృదినోత్స‌వ వేడుక‌లు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*