టాలీవుడ్‌లోకి మ‌రో నంద‌మూరి వార‌సుడు

Share this News:

సినీ హీరోల వార‌సుల హ‌వా ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఎక్కువ‌మంది హీరోల‌ను అందిస్తున్న కుటుంబాలు మాత్రం రెండే! వాటిలో ఒక‌టి నంద‌మూరి కుటుంబం కాగా.. రెండోది మెగా కుటుంబం. ఇరు కుటుంబాల నుంచి పోటాపోటీగా హీరోలు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం నంద‌మూరి కుటుంబం నుంచి మ‌రో హీరో తెలుగు తెర‌పై మెర‌వ‌బోతున్నాడ‌ట‌. ఏంటి త్వ‌ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు క‌దా.. మ‌రో హీరో ఎవ‌రా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రా అనేగా.. నంద‌మూరి శౌర్య‌రామ్‌!!

నందమూరి ఫ్యామిలీ నుంచి.. బాల‌కృష్ణ‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ల్యాణ్‌రామ్, తార‌క‌ర‌త్న‌.. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్ల త‌రువాత‌.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో నందమూరి ఫ్యామిలీ వారసుడు వెండి తెరపై మెరిసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తనయుడు శౌర్యరామ్‌ త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్నాడు.

క‌ళ్యాణ్‌ రామ్‌, పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో ఒక చిన్న గెస్ట్‌ రోల్‌లో శౌర్య కనిపించబోతున్నాడట‌. కళ్యాణ్‌ రామ్‌ చిన్నప్పటి పాత్రలో శౌర్య కనిపించే అవకాశాలు ఉన్నాయని నందమూరి ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇటీవలే షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమాను… శరవేగంగా పూర్తి చేసేందుకు పూరి ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ మధ్య నందమూరి జానకిరామ్‌ తనయుడు బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు శౌర్య ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. భవిష్యత్తులో శౌర్యను కూడా స్టార్‌ను చేయాలని కళ్యాణ్‌ రామ్‌ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

కొడాలి నానికి వైకాపాలో కీల‌క ప‌ద‌వి
ఓయూలో కొత్త ఉద్య‌మానికి శ్రీ‌కారం

Share this News:

Leave a comment

Your email address will not be published.

*