ఈ ఒక్క సందేహాన్ని బన్నిని అడగాలి

Share this News:

ఈ మధ్యనే ఒక ప్రముఖ దినపత్రిలో దాదాపు ఐదు పేజీల వరకూ బన్నీ మీద ఒక కవర్ పేజీ స్టోరీ కథనం వచ్చింది. ఆ స్టోరీ మొదట్లో బన్నీ గురించి చెప్పే క్రమంలో స్టోరీ చెప్పిన విధానాన్ని ఇప్పుడోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేమంటే.. ఈ మధ్యన బన్నీ సీరియస్ గా ఉంటున్న విషయాన్ని చరణ్ ప్రస్తావించటం.. నిజమా? నేను అలా మారానా? అని బన్నీ అనుకోవటం తరహాలో మొదలవుతుంది. పవర్ స్టార్ గురించి ఫ్యాన్స్ కేకలు వేయటం.. తాను మాట్లాడనని చెప్పటం.. ఆ విషయం సోషల్ మీడియాలో రచ్చ కావటం.. ఈ మధ్యన ఒక ప్రముఖ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన బన్నీని.. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడని వైనంపై జరుగుతున్న ఇష్యూ మీద ప్రశ్న వేస్తే.. తాను ఆ విషయం మీద మాట్లాడనని చెప్పటం లాంటి వాటితో మళ్లీ ఈ ఇష్యూ రాజుకోవటం తెలిసిందే.

తాజాగా తన మేనమామ సోదరుడి కూతురు హీరోయిన్ గా నటించిన చిత్ర ఆడియో ఫంక్షన్ కు వచ్చిన అల్లు అర్జున్.. తన చుట్టూ.. పవర్ స్టార్ నడుమ నడుస్తున్న ఇష్యూ మీద మాట్లాడతానంటూ స్పీచ్ ఇవ్వటం మొదలెట్టారు. దాదాపు 11 నిమిషాలకు పైగా సాగిన ఆ స్పీచ్ లో బన్నీ చెప్పిన మాటేమిటంటే.. వేరే వాళ్ల ఫంక్షన్లో (మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్లలో..) పవర్ స్టార్ అంటూ అరవటం ఏంటి? మీరు అరిచినా అరవకున్నా పవర్ స్టార్ గురించి చెబుతాం. కానీ.. వేరేవాళ్ల ఫంక్షన్లో.. కోట్లాది రూపాయిలు ఖర్చుపెట్టిన సినిమాలో.. ఆ సినిమా గురించి కాకుండా.. పవర్ స్టార్ అంటూ అరవటం ఏంటి? ఏం బాగోలేదు బ్రదర్ అంటూ అల్లుఅర్జున్ చాలామాటలే చెప్పారు.

ఆయన చెప్పిన మాటలన్నింటి మీద మెగా అభిమానులకు వచ్చే సవాలచ్చ సందేహాల్ని వదిలేసి.. ఒకేఒక్క సందేహాన్ని బన్నిని అడగాల్సిన అవసరం ఉంది. అదేమంటే.. కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి తీసిన వేరే వాళ్ల ఫంక్షన్లో.. ఆ సినిమా గురించి కాకుండా పవర్ స్టార్ అంటూ అరవటం ఏమిటన్న బన్నీ.. తాను ఈ మాటలన్నీ చెబుతున్నది కూడా తనకు చెందిన సినిమా ఫంక్షన్లో కాదని.. వేరే వాళ్ల సినిమా ఫంక్షన్లో అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి తీస్తే.. పవర్ స్టార్ అనటం ఏమిటంటూ ప్రశ్నించిన బన్నీని.. మరి.. తమ ఇంట ఆడపిల్ల హీరోయిన్ గా నటించిన సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చేసి.. తనకు.. పవర్ స్టార్ కు మధ్య ఉన్న ఇష్యూ గురించి మాట్లాడటం ఏమిటి? తనది కాని వేదికను బన్నీ వాడేసుకోవచ్చు కానీ.. మెగా ఫ్యాన్స్ గా చెప్పుకొనే ‘‘కొందరు’’ పవర్ స్టార్ అని అరవకూడదా?

నాలుగు రాష్ట్రాల‌లో మోడీ ఎందుకు ఓడాడు ?
ఈ అందం సరిపోలేదని ప్రాణం తీసుకుందే

Share this News:

Leave a comment

Your email address will not be published.

*