మ‌హేష్‌ మోసపోతున్నాడా!

Share this News:

ఇండ‌స్ర్టీలో కొన్ని సెంటిమెంట్లు ప‌దే ప‌దే రిపీట్ అవుతుంటాయి. వీటిల్లో కొన్ని హిట్ సెంటిమెంట్లు ఉంటే..మ‌రికొన్ని బ్యాడ్ సెంటిమెంట్లు ఉంటాయి. అలాంటి ఓ బ్యాడ్ సెంటిమెంట్‌కు ప్రిన్స్ మ‌హేష్‌బాబు మ‌రోసారి బ‌ల‌య్యాడు. ఇంట‌స్ర్టీలో హిట్‌/స‌క్సెస్ అన్న ప‌దం చుట్టూనే అంద‌రూ రౌండ్లు వేస్తుంటారు. ఎవ‌రైనా త‌మ‌కు హిట్ ఇచ్చిన కాంబినేష‌న్‌ను రిపీట్ చేసేందుకు ఆస‌క్తి చూపుతారు. ప్రిన్స్ మ‌హేష్‌బాబు కూడా త‌నకు ఫ‌స్ట్ టైం హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుల‌కు రెండో ఛాన్స్ ఇచ్చి ఘోర‌మైన ఫ‌లితాన్ని చూశాడు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ మ‌హేష్ విష‌యంలో చాలాసార్లు రిపీట్ అయ్యింది.

 మ‌హేష్‌కు ఫ‌స్ట్ టైం హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్లు రెండో సారి మాత్రం నెగిటివ్ రిజ‌ల్ట్‌తో పెద్ద షాక్ ఇచ్చారు. వ‌రుస ప్లాపుల్లో ఉన్న ఒక్క‌డుతో మ‌హేష్‌కు తిరుగులేని హిట్ ఇచ్చిన సూప‌ర్‌స్టార్ ఇమేజ్ తెచ్చిన క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ త‌ర్వాత అర్జున్‌, సైనికుడు లాంటి డిజాస్ట‌ర్లు ఇచ్చాడు. ఇక అత‌డు మ‌హేష్ కేరీర్‌లో ఓ డిఫ‌రెంట్ సినిమా. మ‌హేష్‌ను డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ స‌రికొత్త స్టైల్లో ప్ర‌జెంట్ చేశాడు. ఆ సినిమా హిట్ త‌ర్వాత త్రివిక్ర‌మ్‌-మ‌హేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఖ‌లేజా డిజాస్టర్ టాక్ తో నిరాశ పరిచింది.

 ఇక త‌న‌కు సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు లాంటి భారీ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌ను న‌మ్మిన మ‌హేష్ మ‌రో ఛాన్స్ ఇస్తే బ్ర‌హ్మోత్స‌వం లాంటి చెత్త సినిమాతో ప్లాప్ ఇచ్చాడు. మ‌హేష్ విష‌యంలో రెండో సారి ఛాన్స్ ఇచ్చిన డైరెక్ట‌ర్ల‌లో ఒక్క పూరి జ‌గ‌న్నాథ్ మాత్ర‌మే ఈ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేసి హిట్ ఇచ్చాడు. పోకిరి, బిజినెస్‌మేన్ సినిమాల‌తో మ‌హేష్‌కు రెండు వ‌రుస హిట్లు ఇచ్చాడు.

సిలికాన్ వ్యాలీ లో కన్నుల పండుగగా మనబడి స్నాతకోత్సవం  
బీజేపీ నేత‌ల‌కు షాక్ కొట్టే ప్ర‌క‌ట‌న చేసిన సినీహీరో

Share this News:

1 Comment on మ‌హేష్‌ మోసపోతున్నాడా!

  1. Brahmin Namrata has been black-mailing Mahesh since Renu left Pawan;

Leave a comment

Your email address will not be published.

*