ఆధార్ ఉంటేనే సెక్రటేరియట్‌లోకి ఎంట్రీ..!

Share this News:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చింది. తెలంగాణ‌ స‌చివాల‌యంలోకి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌కు డిజిట‌ల్‌ పాస్‌లు ఇచ్చేందుకు నిర్ణ‌యించిన రాష్ట్ర ప్ర‌భుత్వం ఇందుకు ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది. జూన్ 2 నుంచి సెక్రటేరియట్ విజిటర్స్ కి డిజిటల్ ఫోటో గుర్తింపు పాస్‌ల‌ను ప్ర‌భుత్వం అమల్లోకి తెచ్చింది. దీనిద్వారా సందర్శకుల వివరాలతో పాటు… వారు ఏ పనులపై వస్తున్నారు, ఏఏ చాంబర్‌ల‌కు వెళ్తున్నారు అనే అంశాలన్నింటిని ఆన్‌లైన్‌లో న‌మోదు చేయనున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన డిజిటల్ పాసెస్ విధానాన్ని ఇందుకోసం ఉప‌యోగిస్తున్నారు.

ఇక‌ నుంచి సెక్రటేరియట్ కు వచ్చే సందర్శకులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకొని రావాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఎలాంటి ఐడీ కార్డు లేకుంటే పాస్ లు జారీ చేయొద్దని సీఎస్ రాజీవ్ శర్మ ఇప్ప‌టికే అధికారులను ఆదేశించారు. డిజిటల్ పాసుల ద్వారా సందర్శకుల కదలిలతోపాటు.. వారి అవసరాలను కూడా తెలుసుకోనే ఛాన్స్ ఉంద‌ని అధికారులు అంటున్నారు. పాలనలో పారదర్శకత పెంచేందుకే డిజిటల్ పాస్ విధానం ప్రవేశపెట్టామని చెప్తున్నారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ప‌వ‌ర్‌స్టార్‌..!
మౌంటెన్ హౌస్ త్రేసీ తెలుగు సంఘం ఆధ్వ‌ర్యంలో ” లేడీస్ నైట్‌ “

Share this News:

Leave a comment

Your email address will not be published.

*