చిరు 150 కొత్త అప్ డేట్స్ ఇవిగో..

Share this News:

మెగాస్టార్ రీఎంట్రీ సినిమా విషయంలో ఇక ఆలస్యానికి తావు లేనట్లే. ఇంకొన్ని రోజుల్లోనే రామోజీ ఫిలిం సిటీలో ‘కత్తిలాంటోడు’ షూటింగ్ మొదలు కాబోతోంది. దర్శకుడు వి.వి.వినాయక్‌కు తన ప్రతి సినిమా షూటింగ్‌నూ ఓ ఫైట్ చిత్రీకరణతో మొదలుపెట్టడం అలవాటు. చిరంజీవి సినిమాను కూడా వినాయక్ అలాగే మొదలుపెట్టబోతున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ ఫైట్‌తో షూటింగ్ మొదలు కాబోతోంది. ఇంకో వారం రోజుల్లోనే చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం.

ఈ సినిమా కోసం లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఈ మూవీలో కొన్ని కీలక సన్నివేశాల కోసం భారీ లెవెల్లో జైలు సెట్ సిద్ధం చేస్తున్నారు. చిరంజీవి, ఆయన తోటి ఖైదీలు కొందరు జైలు నుంచి పారిపోయే సీన్ కోసం ఈ సెట్ రెడీ అవుతోంది. ఫిలిం సిటీలో భారీ లెవెల్లో ఈ సెట్ తీర్చిదిద్దుతున్నారట. సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ ఇక్కడేు జరుగుతుందని సమాచారం.

ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదు. తాజాగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనే పేరు వినిపిస్తోంది. చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రానికి ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. తమిళంలో విజయ్ నటించిన బ్లాక్ ‌బస్టర్ మూవీ ‘కత్తి’కి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. దేవిశ్రీప ప్రసాద్ సంగీతం అందిస్తాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘కత్తిలాంటోడు’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు.

రజినీ సార్.. ఇది టూమచ్
అమెరికాలో చదువా.. జాగ్రత్త కుర్రాళ్లూ

Share this News:

1 Comment on చిరు 150 కొత్త అప్ డేట్స్ ఇవిగో..

  1. daya chesi 150 cinema chooda vaddu. boycott cheyyandi. Yee hero real political life lo zero. telugu talliki ithanu chesina droham marchipolenidi. daya chesi AP division time lo ithanu parliament lo siggupaduthu matladina clippings choodandi. please boycott his 150th picture. He is not a hero.Sonia Gandhi kalladaggira kurchunnadu. Telugu talli kadupu chilchadu.

Leave a comment

Your email address will not be published.

*