రజినీ సార్.. ఇది టూమచ్

Share this News:

ఇప్పటికే మూణ్నాలుగు సార్లు ‘కబాలి’ రిలీజ్ డేట్ మార్చారు. మే మొదటి వారంలో వస్తుందనుకున్న సినిమా డేట్లు మార్చుకుని చివరికి జులై 1కి ఫిక్సయింది. అభిమానులు కూడా ఈ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ఉన్నట్లుండి ఇప్పుడు మళ్లీ వాయిదా వార్తలు వినిపిస్తున్నాయి. జులై 1 నుంచి 15వ తేదీకి రిలీజ్ డేట్ మార్చేసినట్లు చెబుతున్నారు.

జులై 6న సల్మాన్ ఖాన్ సినిమా ‘సుల్తాన్’ విడుదలవతున్న నేపథ్యంలో ముందు వారం ‘కబాలి’ని రిలీజ్ చేయడం రెండు సినిమాలకూ మంచిది కాదన్న ఉద్దేశంతో డేట్ మార్చారని కొందరంటుంటే.. తెలుగు-తమిళం-హిందీతో పాటు కొన్ని విదేశీ భాషల్లోనూ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో డబ్బింగ్, ఇతర కార్యక్రమాలు ఆలస్యం కావడం వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా టీజర్ చూశాక ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వాయిదా వార్తలు తీవ్ర అసంతృప్తిని మిగిలుస్తున్నాయి. ఇప్పటికే ఆడియో వేడుక లేదని ఫీలవుతున్న అభిమానులకు తాజా వార్తలు నిరాశ కలిగించేవే. కనీసం జులై 15న అయినా సినిమా ఖాయంగా వస్తుందో లేదో అని వారు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాన్స్‌ను ఇలా మనోవేదనకు గురి చేయడం కరెక్టా రజినీ సార్?

అ..ఆ టైటిల్‌కు కొత్త అర్థం చెప్పిన చంద్ర‌బాబు
చిరు 150 కొత్త అప్ డేట్స్ ఇవిగో..

Share this News:

Leave a comment

Your email address will not be published.

*