అమెరికాలో చదువా.. జాగ్రత్త కుర్రాళ్లూ

Share this News:

అమెరికా చదువంటే మనోళ్లకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఈ మోజులో ముందు వెనుకా చూసుకోకుండా యుఎస్ ఫ్లైట్ ఎక్కేస్తున్న మన పిల్లలకు అక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ మధ్యే సరైన ప్రిపరేషన్ లేకుండా వెళ్లిన మన విద్యార్థుల్ని ఎయిర్ పోర్టుల నుంచే వెనక్కి పంపించేసిన ఘటనలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.  తాజాగా ఓ మీడియా కథనం చూస్తే మనోళ్లకు అమెరికాలో ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో అర్థమవుతుంది.

ఈ కథనం ప్రకారం వెస్టర్న్ కెంటకీ యూనివర్శిటీ లో చేరిన భారతీయ విద్యార్దులను యూనివర్శిటీ బహిష్కరించిదట. స్పాట్ అడ్మిషన్ పేరుతో వీరిని నమ్మించి నిబందనల గురించి చెప్పకుండా అడ్మిషన్లు ముందుగా ఇచ్చి పీజులు వసూలు చేసిన ఈ యూనివర్శిటీ తొలి సెమిస్టర్ పూర్తి అయ్యే సమయంలో మీకు అర్హతలు లేవని చెప్పి విద్యార్దులపై వేటు వేసిందట. మల్లీ వీరిలో కొందరికి తగిన కోర్సులో చేరడానికి సహకరిస్తామని అంటోంది. స్పాట్ అడ్మిసన్ల సమయంలోనే వీరికి అర్హత ఉందా లేదా అని చుూడాల్సిన యూనివర్శిటీ ఆ పని చేయకుండా ఫీజులు వసూలు చేసుకుని.. ఇప్పుడిలా ఫ్లేటు ఫిరాయిస్తే ఎలా అంటున్నారు. దాదాపు నలభై మంది విద్యార్ధులను ఇలా అనర్హులుగా తేల్చినట్లు తెలుస్తోంది. వారికి ఫీజులు తిరిగి చెల్లించే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి అమెరికాలో చదివే అవకాశం వచ్చిందనగానే ఎగిరి గంతేసే విద్యార్థులు కాస్త అప్రమత్తంగా ఉండాలని ఈ ఉదంతం తెలియజేస్తోంది.

చిరు 150 కొత్త అప్ డేట్స్ ఇవిగో..
సోనియమ్మ మీద  కేసు బుక్ చేశారు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*