హ‌వ్వః హిందువుల్లో పురుష‌త్వం త‌గ్గిపోతుంద‌ట‌

Share this News:

విశ్వహిందూపరిషత్‌ సీనియర్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందూ పురుషుల్లో పురుషత్వం తగ్గిపోతున్నదని ఆయ‌న తేల్చేశారు. అందుకే దేశంలో హిందువుల జ‌నాభా త‌గ్గిపోతోంద‌ని చెప్పారు. హిందువులు తమ త‌మ ఇళ్లకు వెళ్లి వారిలోని పురుషత్వాన్ని ఆరాధించాలని ఆయ‌న సూచించారు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ సొంత రాష్ట్రమైన‌ గుజరాత్‌లోని బరూచ్‌ జిల్లా జంబూసార్‌లో జ‌రిగిన స‌భ‌లో తొగాడియా మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిందూ పురుషులు త‌మ శృంగార సామ‌ర్థ్యాన్ని పూర్తిగా ఆస్వాదించ‌డం లేద‌ని తొగాడియా చెప్పారు. హిందువుల్లో నపుంసకత్వం పెరిగిపోతున్నదని, ఫలితంగా జనాభా సంఖ్య తగ్గిందని ఆయన అన్నారు.  దేశంలో పెరుగుతున్న ముస్లిం జనాభాను అధిగమించేందుకు హిందూ దంపతులు ఎక్కువమంది సంతానానికి జన్మనివ్వాలని ఆయన సూచించారు. దేశ జ‌నాబా విప‌రీతంగా పెరిగిపోవ‌డంపై ముస్లింలు ఏమాత్రం స్పందించ‌కుండా, కుటుంబ నియంత్ర‌ణ పాటించ‌కుండా పిల్ల‌ల్ని క‌నేస్తుంటార‌ని ఆర్ఎస్ఎస్ వ‌ర్గాలు ప‌లు సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించాయి. ఈ క్ర‌మంలో ముస్లింలు కాని వారు మాత్ర‌మే ఆప‌రేష‌న్లు ఎందుకు చేయించుకోవాల‌ని ప్ర‌శ్నించాయి. అయితే తాజాగా మ‌రో అడుగు ముందుకు వేసి న‌పుంస‌క‌త్వం వ్యాఖ్య‌లు చేయ‌డం, అది కూడా తొగాడియా నోటి నుంచి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

అడ్డంగా బుక్క‌యిపోయిన క‌న్న‌య్య‌
ప‌వ‌న్‌కు షాక్ ఇచ్చిన అభిమాని

Share this News:

1 Comment on హ‌వ్వః హిందువుల్లో పురుష‌త్వం త‌గ్గిపోతుంద‌ట‌

  1. Hinduism is nothing but a COVERT mask for Casteism

Leave a comment

Your email address will not be published.

*