మురుగ‌దాస్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌

Share this News:

ఏఆర్‌.మురుగ‌దాస్ ఈ పేరు ఇండియ‌న్ సినిమా అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని శంక‌ర్ ముందుగా ఎల్లులు దాటిస్తే త‌ర్వాత ఆ స్థాయి క్రేజ్ సొంతం చేసుకున్న‌ది మురుగ‌దాస్ మాత్ర‌మే. గ‌జ‌నీ, తుపాకీ, సెవెన్త్‌సెన్స్‌, క‌త్తి, స్టాలిన్ ఇలా వైవిధ్య‌మైన క‌థాబ‌లం ఉన్న స్టోరీల‌తో సామాజిక అంశాల మేళ‌వింపుతో క‌మ‌ర్షియ‌ల్ హిట్లు కొట్టే స‌త్తా ఈ క్రేజీ డైరెక్ట‌ర్ సొంతం.

 సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డైన మురుగ‌దాస్ – టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జూలై నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. సోష‌ల్ ఎలిమెంట్స్‌తో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం మురుగ‌దాస్ ఓ బ‌ల‌మైన స్టోరీ రెడీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూ.100 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం మురుగ‌దాస్ తీసుకునే రెమ్యున‌రేష‌న్‌ఫై ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా స‌ర్కిల్స్‌లో హాట్ హాట్‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ సినిమాకు మురుగ‌దాస్ ఏకంగా రూ.20 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట‌. ఇక తెలుగు వ‌ర‌కు ఓ సినిమా రిలీజ్‌కు ముందే ఈ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ తీసుకున్న డైరెక్ట‌ర్ ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో మురుగ‌దాస్ టాలీవుడ్‌లోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసిన‌ట్ల‌య్యింది.

 ఖుషీ, నాని, కొమ‌రం పులి చిత్రాల ద‌ర్శ‌కుడు ఎస్‌జె.సూర్య విల‌న్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు టాప్ సినిమాటోగ్రాప‌ర్ సంతోష్‌శివ‌న్‌, క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హ‌రీష్‌జైరాజ్ లాంటి టాప్ టెక్నీషియ‌న్లు ప‌ని చేస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న బాలీవుడ్ హాట్ బ్యూటీ ప‌రిణితి చోప్రా హీరోయిన్‌గా ఎంపికైన‌ట్టు స‌మాచారం. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ 3.5 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే ఈ మూవీని ఏక‌ధాటిగా జ‌రిగే సింగిల్ షెడ్యూల్‌లో ఫినిష్ చేయాల‌ని మురుగ‌దాస్ ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు.

బోయ‌పాటి మ‌ల్టీస్టార‌ర్ మూవీ…హీరోలెవ‌రో తెలుసా..!
సాక్షి పేప‌ర్ రేటు త‌గ్గుతుందా..!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*