వావ్‌.. రోబో-2 గురించి సూప‌ర్ అప్‌డేట్‌

Share this News:

కొన్ని రోజులుగా బాహుబ‌లిః ది కంక్లూజ‌న్ మేనియాలో ప‌డి సౌత్ ఇండియాలో తెర‌కెక్కుతున్న మ‌రో విజువ‌ల్ వండ‌ర్ గురించి మ‌రిచిపోతున్నాం. బాహుబ‌లి షూటింగ్ మొద‌లైన నెల రోజుల‌కే రోబో-2 కూడా సెట్స్ మీదికి వెళ్లిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలో అత్య‌ధికంగా రూ.400 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చ‌డీచ‌ప్పుడు లేకుండా సాగిపోతుంది. ఇప్ప‌టికే వంద రోజుల పాటు రోబో-2 షూటింగ్ జ‌రిగిన‌ట్లు.. 50 శాతం సినిమా పూర్త‌యిపోయినట్లు మంగ‌ళ‌వారం రాత్రి శంక‌ర్ వెల్ల‌డించ‌డంతో అందరూ ఆశ్చ‌ర్య‌పోయారు. రోబో-2 లాంటి ప్రెస్టీజియ‌స్ మూవీని 100 రోజుల్లోనే స‌గం పూర్తి చేయ‌డ‌మంటే చిన్న విష‌యం కాదు.

‘‘2.0 షూటింగ్ వందో రోజు. ఉఫ్‌.. క్లైమాక్స్ తో పాటు రెండు భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ షూటింగ్ పూర్త‌యింది. మా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, అక్ష‌య్ కుమార్‌ల‌తో క‌లిసి కీల‌క‌మైన భారీ వీఎఫ్ఎక్స్ సీక్వెన్స్ కూడా తీశాం. లోడింగ్ 50 ప‌ర్సంట్  అని ట్వీట్ చేశాడు శంక‌ర్‌. ర‌జినీకాంత్‌తో షూటింగ్ స్పాట్లో మాట్లాడుతున్న ఫొటో కూడా షేర్ చేశాడు శంక‌ర్‌. అందులో శంక‌ర్ విగ్గుతో యంగ్‌గా క‌నిపిస్తున్నాడు. బ‌హుశా ఇది చిట్టి రోబో లుక్ కావ‌చ్చేమో. ముందు శ్ర‌మ‌తో కూడుకున్న యాక్ష‌న్ సీక్వెన్స్, క్లైమాక్స్ పూర్తి చేసిన శంక‌ర్.. ఇక మామూలు స‌న్నివేశాల‌పై దృష్టిపెట్ట‌నున్నాడు. దీంతో పాటే స‌మాంత‌రంగా వీఎఫ్ఎక్స్ ప‌నులు జ‌రుగుతాయి. వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో 2.0 ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశాలున్నాయి.

ఎమ్మెల్యే ఫైర్ః యూజ్‌లెస్ ఫెలో…బుద్దుందా
బోయ‌పాటి మ‌ల్టీస్టార‌ర్ మూవీ…హీరోలెవ‌రో తెలుసా..!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*