వందో సినిమా మిస్.. ఒకటో ఛాన్స్ పక్కా

Share this News:

కొందరు నిర్మాతలతో కొందరు హీరోలు దర్శకులు భలేగా కనెక్టయిపోతుంటారు. అలా కనెక్టయ్యాక వరుసగా సినిమాలు చేస్తారు. దర్శకుడిగా మారాక ఒకసారి పని చేసిన నిర్మాతతో మళ్లీ పని చేయకుండా సాగిపోతూ వచ్చిన త్రివిక్రమ్.. రాధాకృష్ణతో మాత్రం తక్కువ వ్యవధిలో మూడు సినిమాలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక్కడ కంఫర్ట్ అన్నది చాలా కీలకమైన విషయం. అలా నందమూరి బాలకృష్ణ చాలా కంఫర్టబుల్ గా ఫీలైన నిర్మాతల్లో సాయి కొర్రపాటి ఒకరు. ‘లెజెండ్’ సినిమాకు ఈయన పూర్తి స్థాయి నిర్మాత కాకపోయినా.. భాగస్వామి అయినా బాలయ్య మనసు గెలిచారు. ఆయనకు అత్యంత ఆప్తుల్లో ఒకరైపోయారు. బాలయ్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన వందో సినిమాకు ఓ దశలో ఈయనే నిర్మాత కూడా.

ఐతే క్రిష్ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని స్వయంగా నిర్మించాలనుకోవడంతో సాయి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఐతే బాలయ్య వందో సినిమా మిస్సయినా.. బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్న తొలి సినిమాకు మాత్రం సాయి కొర్రపాటే నిర్మాత అని పక్కా సమాచారం వస్తోంది. మోక్షజ్న కోసం ఆయన ఆల్రెడీ ‘రానే వచ్చాడయ్యా ఆ రామయ్యా’ అనే టైటల్ రిజిస్టర్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ కు ఓకే చెప్పడమే కాక.. మోక్షజ్న తొలి సినిమాను సాయినే నిర్మించడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు.. కథ విషయంలో చర్చలు సాగుతున్నాయి. ఓ అగ్ర దర్శకుడినే ఈ ప్రాజెక్టు కోసం ఎంచుకోవాలని భావిస్తున్నారు. బోయపాటి శ్రీను పేరు ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2017లో మోక్షజ్న అరంగేట్రం ఉంటుందని బాలయ్య ఇంతకుముందే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోక్షజ్న నటన.. డ్యాన్సులు.. ఫైట్లు సాధన చేస్తున్నట్లు సమాచారం.

ఎస్.జె.సూర్య రీజన్ సిల్లీగా ఉందే..
హ‌మ్మ‌య్యా… విశ్వ‌రూపం 2 వ‌స్తోంది

Share this News:

Leave a comment

Your email address will not be published.

*