చంచ‌ల్‌గూడా జైలుకు చిరంజీవి!

Share this News:

అవును. మెగ‌స్టార్, ఎంపీ చిరంజీవి చంచ‌ల్‌గూడా జైలుకు వెళ్లారు. ఎందుకోసం అనుకుంటున్నారు? ఆయ‌న 150వ చిత్రం షూటింగ్ కోసం. 9 ఏళ్ళ తర్వాత చిరంజీవి చేస్తున్న ఫుల్ లెంగ్త్ మూవీ  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  ఇటీవల మొదలైన ఈ చిత్ర షూటింగ్ తాజాగా చంచల్ గూడకి చేరుకుంది. అక్కడ జైలులో కొన్ని సన్నివేశాలను ఇక్క‌డ చిత్రీకరిస్తున్నారు. వీవీ వినాయక్ తన దైన స్టైల్‌లో చిత్రీకరించే సన్నివేశాలు ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

చిరంజీవి ఖైదీ డ్రెస్‌లో ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం నెట్‌లో చక్కర్లు కొడుతుంది. చిరు డ్రెస్‌పై 150 అనే నంబర్ కనిపిస్తుండగా, ఇది తన 150వ సినిమా కాబట్టి అదే అంకెని ఖైదీ నెంబర్‌గా మార్చారని టాక్. ప్రస్తుతం జైలు నుంచి తప్పించుకునే కొన్ని సన్నివేశాలను తీస్తున్న వినాయక్ ఆ తర్వాత రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో మేజర్ షెడ్యూల్‌ని చిత్రీకరించనున్నట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన బాణీలను కూర్చే పనిలో బిజీ అయ్యాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో మూవీ యూనిట్ ఉంది.

ల‌క్కీ గ‌ర్ల్‌.. ఈ ఢిల్లీ డాళ్‌
ఇస్తాంబుల్ దాడి నుంచి బాలీవుడ్ స్టార్ సేఫ్‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*