ల‌క్కీ గ‌ర్ల్‌.. ఈ ఢిల్లీ డాళ్‌

Share this News:

మీడియం హీరోలకి ఓ హిట్ కావాలంటే.. ఈ హీరోయిన్ ని సంప్రదించాల్సిందే అన్న‌ట్లుగా ఉంది ల‌క్కీ గ‌ర్ల్‌గా పేరు తెచ్చుకుంటున్న ఓ ఢిల్లీ డాళ్ ప‌రిస్థితి. ఇంత‌కీ ఆ ల‌క్కీ గ‌ర్ల్ ఎవ‌రంటే.. వైట్ బ్యూటీ సుర‌భి. సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన బీరువాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సురభికి ఆ చిత్రం మంచి విజ‌యాన్నే అందించింది.అంతేనా.. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ త‌రువాత స‌రైన విజ‌యం లేని అత‌నికి మ‌రో హిట్ ని ఇచ్చింది. 

ఆ త‌రువాత సుర‌భి న‌టించిన ఎక్స్‌ప్రెస్ రాజా కూడా హిట్ లిస్ట్‌లోకి చేరింది. టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ కెరీర్‌లో మ‌రో స‌క్సెస్‌ఫుల్ మూవీగా నిలిచింది. ఆ త‌రువాత వ‌చ్చిన మంచు మ‌నోజ్‌, రాం గోపాల్ వ‌ర్మ‌ల ఎటాక్ నిరాశ‌ప‌రిచినా.. తాజాగా వ‌చ్చిన జెంటిల్ మ‌న్ సుర‌భికి ల‌క్కీ గ‌ర్ల్ ఇమేజ్‌ని పెంచింది. ఫుల్‌ఫామ్‌లో ఉన్న నానికి మ‌రో విజ‌యాన్నిచ్చింది. మొత్తానికి ఈ ఢిల్లీ డాళ్‌.. టాలీవుడ్ యంగ్ హీరోల పాలిట  న‌యా ల‌క్కీ గ‌ర్ల్‌గా అవ‌త‌రించిందనే చెప్పాలి.

నాని తో ఎంట్రీ ఇస్తే అదుర్స్‌
చంచ‌ల్‌గూడా జైలుకు చిరంజీవి!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*