ఇస్తాంబుల్ దాడి నుంచి బాలీవుడ్ స్టార్ సేఫ్‌

Share this News:

ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో జ‌రిగిన పేలుళ్ల నుంచి బాలీవుడ్ సుప‌ర్‌ స్టార్ హృతిక్ రోష‌న్ సేఫ్ అయ్యాడు. ఆ పేలుళ్ల‌కు కొద్ది స‌మ‌యం ముందు వ‌ర‌కు హృతిక్ అక్క‌డే ఉన్నాడు.  అయితే ఆయ‌న విమానంలో బ‌య‌లుదేరిన త‌ర్వాత ఈ ఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలుసుకొని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో స్పందించాడు.

హృతిక్ త‌న ఇద్ద‌రు పిల్లలు రిహాన్‌, హృదాన్‌తో క‌లిసి ట‌ర్కీ టూర్‌కు వెళ్లారు. ఘ‌ట‌న‌కు ముందు రోజు ఇస్తాంబుల్ అటాటుర్క్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బాలీవుడ్ స్టార్ తిరుగు ప్ర‌యాణం కావాల్సి ఉంది. అయితే తాను ఎక్కాల్సిన క‌నెక్టింగ్ ఫ్ల‌యిట్‌ను హృతిక్ మిస్స‌య్యాడు. మ‌రో విమానంలో వెళ్లేందుకు హృతిక్‌కు బిజినెస్ క్లాస్ టికెట్లు ల‌భించ‌లేదు. దాంతో హీరో త‌న పిల్ల‌తో అక్క‌డే వెయిటింగ్ చేశారు.

కానీ కొంత స‌మ‌యం త‌ర్వాత అక్క‌డున్న సిబ్బంది హృతిక్‌కు హెల్ప్ చేశారు. మ‌రో విమానంలో ఎకాన‌మీ క్లాస్‌లో అక్క‌డున్న సిబ్బంది హృతిక్‌కు టికెట్లు ఇప్పించారు. దాంతో హృతిక్ త‌న ఇద్ద‌రు కుమారుల‌తో ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిపోయాడు. త‌న‌కు స‌హ‌క‌రించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి హృతిక్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వ‌ల్లే తాను క్షేమంగా ఉన్న‌ట్లు ట్వీట్‌లో తెలిపాడు. ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిలో 36 మంది మ‌ర‌ణించ‌గా, మ‌రో 140 మంది గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

చంచ‌ల్‌గూడా జైలుకు చిరంజీవి!
దూకుడు త‌గ్గించిన ఏపీ మంత్రి..!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*