బాబు ఆదాయం ఎంతో తెలుసా?

Share this News:

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న స్మార్ట్ పల్స్ సర్వేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రారంభించారు. తొలిరోజు ముఖ్యమంత్రి వివ‌రాలు సేక‌రించ‌డం ద్వారా ప్రారంభ‌మైన ఈ స‌ర్వేలో చంద్ర‌బాబే త‌న పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌క‌పోవ‌డం ఆసక్తిక‌ర‌మంటున్నారు. బాబు చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం ఆయ‌న వార్షికాదాయం రూ. 36 లక్షలు.

స‌ర్వేలో భాగంగా  తొలుత ఎన్యుమరేటర్లు ముఖ్యమంత్రికి సంబంధించిన వివరాలు సేకరించారు. సీఎంగా తనకు వచ్చే ఆదాయం అన్నింటితో కలుపుకుని రూ. 36 లక్షలని చంద్రబాబు ఎన్యుమరేటర్లకు వివరించారు. త‌నతో  సహా ఆయన ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్, ఓటర్ ఐడీ అన్నీ హైదరాబాద్‌లో ఉండగా స్థిర, చరాస్తులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయని తెలిపారు. తన స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావాలిపల్లెలో స్థిర, చరాస్తులు ఉన్నాయని, అయితే వీటి వివరాలను తరువాత చెప్తానని చంద్ర‌బాబు తెలిపారు.

దీంతో స‌రేన‌న‌డం ఎన్యుమ‌రేట‌ర్ల వంతయింది. కాగా సీఎం ఆధార్ కార్డు నెం. 300300688099, ఓటర్ ఐడీ నెం. ఎఫ్‌ఐవి 2036739 ప్రకారం ఎన్యుమరేటర్లకు వివరాలను విశదీకరించారు. అయితే ఓటర్ ఐడీతో పాటు ఆధార్ కార్డు హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లుగానే ఉన్నందున వాటిని బదిలీ చేయించాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. సీఎం చెప్పిన కొన్ని వివరాలను నమోదు చేసుకున్న ఎన్యుమరేటర్లు పల్స్ ఏడబ్ల్యుకెపీ 202963 నెంబరుగా ప్రకటించారు.

వైసీపీ నుంచి మ‌రో ఎమ్మెల్సీ జంప్‌!
వైకాపాకు సుప్రీం కోర్టు షాక్‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*