మోడీకి మళ్లీ సుప్రీం షాక్

Share this News:

సుప్రీంకోర్టులో మోడీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఒకసారి ఉత్తరాఖండ్ ఇష్యూలో సుప్రీంకోర్టు నుంచి ఫుల్లుగా చీవాట్లు తిన్న మోడీకి మరోసారి సుప్రీం నుంచి అక్షింతలు పడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను సుప్రీంకోర్టు కొట్టేసింది.

అరుణాచల్ ప్రదేశ్ లో  నెలకొన్న రాజకీయ సంక్షోభంపై గవర్నర్‌ జ్యోతిప్రసాద్‌ తీసుకున్న నిర్ణయాలన్నీ చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ రోజు అరుణాచల్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్‌ 9 తర్వాత గవర్నర్‌  తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ సమ్మతం కాదని తేల్చిచెప్పేసింది.   కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ సీఎంగా నబాంతుకి కొనసాగాలని కోర్టు పేర్కొంది. గత ఏడాది జనవరి 26న కేంద్ర ప్రభుత్వం అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. 2015 డిసెంబర్‌ 15 ముందునాటి పరిస్థితిని పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది.

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించడం.. తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలన్నీ చెల్లబోవని కోర్టు క్లియర్ గా చెప్పేసింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నబాం టుకీ 2011 నవంబరు 1న అరుణాచల్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు.  ఆ తరువాత 2014లో సార్వత్రిక ఎన్నికలతో పాటు మళ్లీ ఎన్నికలు జరగ్గా టుకీనే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 60 సీట్లున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 42.. బీజేపీకి 11 సీట్లు వచ్చాయి. అయితే.. అనంతర పరిణామాల్లో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కుంది. ఆ తరువాత గవర్నరు సాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయగా ఫలించకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించింది. దీనిపై అరుణాచల్ కాంగ్రెస్ కోర్టుకెక్కింది. తాజా తీర్పులో సుప్రీం మళ్లీ టుకీనే సీఎంగా ఉండాలని తీర్పునిచ్చింది.

బాబు ర్యాంకుల లెక్క మారింది తెలుసా?
హరీశ్ కు ఊహించని షాక్ తగిలిందే

Share this News:

Leave a comment

Your email address will not be published.

*