వినాయ‌క్‌ను బాధ‌పెట్టిన చెర్రీ

Share this News:
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎట్ట‌కేల‌కు ఊరించి…ఊరించి ప‌ట్టాలెక్కింది. స్టార్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందా అని అంద‌రూ ఎంతో ఆస‌క్తితో ఉన్నారు. చిరు దాదాపు 9 సంవ‌త్స‌రాల త‌ర్వాత వెండితెర‌పై హీరోగా న‌టిస్తున్న సినిమా కావ‌డంతో పాటు చిరు కేరీర్‌లో 150వ ప్రాజెక్టు కావడంతో అంద‌రికి ఈ మూవీపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.
  ఈ నేప‌థ్యంలోనే డైరెక్ట‌ర్ వినాయ‌క్ ఈ సినిమా పేరు ‘కత్తిలాంటోడు’ అనే హింట్ ఇస్తూ, ఒక వేదికపై ఈ మాటను రివీల్ చేశారు. వినాయ‌క్ ఆ మాట‌ను రివీల్ చేయ‌డంతో అంద‌రూ చిరు టైటిల్ క‌త్తిలాంటోడు అని ఫిక్స‌యిపోయారు. త‌ర్వాత ఈ వార్త మీడియాలో బాగా హ‌ల్‌చ‌ల్ చేసేసింది. అయితే రెండు రోజుల క్రితం చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ ఫ్యాన్స్‌తో చేసిన లైవ్ చాటింగ్‌లో ఈ సినిమా టైటిల్ అది కాదనీ, త్వరలో టైటిల్ ప్రకటిస్తామని అభిమానులతో చెప్పాడు.
  ఇక క‌త్తిలాంటోడు టైటిల్ వినాయక్ చాలా ఇష్టపడి పెట్టిందట. కథాపరంగా సరిగ్గా సరిపోతుందని.. చిరూ ఇమేజ్ కి తగిన టైటిల్ అని ఆయన భావించాడని అంటున్నారు. అలాంటి టైటిల్‌ను ప‌క్క‌న పెట్టేస్తున్న‌ట్టు చెర్రీ ఓపెన్‌గా చెప్ప‌డంతో వినాయ‌క్ ఫీల‌య్యాడ‌ని ఇండ‌స్ర్టీలో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.
 ఇక కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్‌పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు చిరు స‌తీమ‌ణి సురేఖ స‌మ‌ర్ప‌కురాలిగా ఉన్నారు. దేవిశ్రీప్ర‌సాద్ స్వ‌రాలందిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.
టీ వంట‌ల‌పై కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌
చైతుకు హ్యాండ్ ఇచ్చిన స‌మంత‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*