బాల‌య్య వందో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌

Share this News:
యువ‌ర‌త్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన వందో  సినిమా షూటింగ్‌ను చ‌కా చ‌కా కానిచ్చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రిత‌మే షూటింగ్ స్టార్ట్ అయినా ఇప్ప‌టికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఇటీవ‌ల ఈ సినిమా డైరెక్ట‌ర్ క్రిష్ పెళ్లి సంద‌ర్భంగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చేవ‌ర‌కు గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ జ‌రిగింది.
 ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శ్రేయ బాల‌య్య స‌ర‌స‌న‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి హేమ‌మాలిని సైతం బాల‌య్య‌కు త‌ల్లిగా మ‌హారాణి పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ముందునుంచి సంక్రాంతికే రిలీజ్ అవుతుంద‌ని టాక్ ఉన్నా మ‌ధ్య‌లో షూటింగ్‌కు బ్రేక్ రావ‌డంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంద‌రిలోను ఉత్కంఠ నెల‌కొంది.
 అయితే శాత‌క‌ర్ణి రిలీజ్‌డేట్‌పై ఉన్న స‌స్పెన్స్‌ను ద‌ర్శ‌కుడు క్రిష్ రివీల్ చేసేశాడు. అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ కు వచ్చిన క్రిష్ బాలయ్య సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ చేశాడు. శాత‌క‌ర్ణి ముందునుంచి అనుకుంటున్న‌ట్టుగానే 12 జనవరి 2017న విడుదల చేస్తామని చెప్పాడు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షెడ్యూల్స్‌లో సినిమాని యుద్ధ స‌న్నివేశాల‌ను షూట్ చేసిన‌ట్టు స‌మాచారం. ద‌ర్శ‌కుడు క్రిష్ స్వ‌యంగా రిలీజ్ డేట్ గురించి చెప్ప‌డంతో బాల‌య్య వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో దిగ‌డం ఖాయ‌మైపోయింది.
కేసీఆర్ క‌ళ్ల‌ద్దాల కోసం విరాళాల సేక‌ర‌ణ‌
షాకింగ్ బిజినెస్ చేస్తోన్న చిరు 150వ సినిమా

Share this News:

Leave a comment

Your email address will not be published.

*