క్రిష్-అనుష్క మ‌ధ్య ఎందుకు చెడింది..!

Share this News:

30 ఏళ్లు పైబ‌డినా.. టాలీవుడ్‌లో అగ్ర‌స్థానంలో ఉన్న న‌టి అనుష్క‌. `అరుంధ‌తి`తో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల‌కు ట్రేడ్ మార్కుగా నిలిచిపోయింది ఈ యోగా టీచ‌ర్‌. ఆ సినిమా త‌ర్వాత అనుష్క రేంజ్‌ను మ‌రోమెట్టు ఎక్కించిన చిత్రం `వేదం`. అందులో ఆమె న‌టించిన వేశ్య పాత్ర‌కు విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మ‌రి అంత మంచి పాత్ర ఇచ్చిన ద‌ర్శ‌కుడు క్రిష్ వివాహానికి అతిర‌థ మ‌హార‌ధులు హాజ‌ర‌య్యారు. కానీ అనుష్క మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మ‌రి అనుష్కను క్రిష్ పిల‌వ‌లేదా?  లేదా క్రిష్ పిలిచినా.. అనుష్కే రాలేదా? అస‌లేం జ‌రిగింది వీరి మ‌ధ్య ? ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

             టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్‌. ఆదివారం జ‌రిగిన ఈ ద‌ర్శ‌కుడి వివాహానికి టాలీవుడ్ నుంచే కాక కోలీవుడ్ నుంచి కూడా ప‌లువురు ప్ర‌ముఖులు వ‌చ్చి ఆశీర్వ‌దించి వెళ్లారు. అంద‌రూ వ‌చ్చినా క్రిష్‌కు అత్యంత ఆప్తురాలు అనుష్క రాక‌పోవ‌డంపై ఇండ‌స్ర్టీలో ఓ రేంజ్‌లో చర్చించుకున్నార‌ట‌. ఎందుకంటే అనుష్క, క్రిష్‌ల మధ్య మంచి స్నేహబంధం ఉండటమే ఇందుకు కార‌ణం. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన వేదం సినిమా నుంచి వీరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. మ‌రి ఇంత స్నేహం ఉన్నా అనుష్క ఎందుకు రాలేదంటే.. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న‌ గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమానేనని కొంద‌రు చ‌ర్చించుకున్నారు.

             ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్కను పెడదామని క్రిష్‌ ఎంతో ప్రయత్నించాడ‌ట‌. అయితే ఆమె ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించింది. అంతేకాదు క్రిష్‌ను కాద‌ని… ప్రభాస్ సన్నిహితులు నిర్మిస్తున్న ‘భాగమతి’ కోసం డేట్స్ ఇచ్చింద‌ట‌. దీంతో కొంచెం హ‌ర్ట‌యిన‌ క్రిష్.. ఈమెను వ్యక్తిగతంగా పిలవ లేదా? అని కూడా కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. అయితే టాలీవుడ్‌లో అంద‌రితోనూ స‌త్సంబంధాలు మెయింటైన్ చేసే అనుష్క‌.. మ‌రి పిలిస్తే ఈ పెళ్లికి హాజ‌ర‌వ‌కుండా ఉంటుందా? అని కూడా గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

సిలికానాంధ్ర 15వ వార్షికోత్సవం- గరికిపాటి అవధానం
కేసీఆర్ తో పెట్టుకున్నాడు.. ఖతమయ్యాడు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*