శాత‌క‌ర్ణికి షాక్ ఇచ్చిన దేవిశ్రీ..!

Share this News:

యువ‌ర‌త్న నంద‌మూరి నటసింహం బాలకృష్ణ కేరీర్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. బాల‌య్య కేరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాగా తెర‌కెక్కుతుండ‌డంతో ఈ సినిమా కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. సినిమాకు బ‌డ్జెట్ విష‌యంతో పాటు టెక్నీషియ‌న్స్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్‌ను తీసుకున్నారు.

 ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ కార్యక్రమాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమాను 2017 సంక్రాతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు స్పీడ్‌గా జ‌రుగుతున్నా మ్యూజిక్ సిట్టింగ్ ప‌నులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేద‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు దేవిశ్రీ  ఒక్క పాట కూడా రికార్డ్ చేయలేదని, మరోవైపు వీలైనంత త్వరగా పాటలు రికార్డ్ చేయాలని దేవిశ్రీని క్రిష్ తొందరపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 అయితే దేవిశ్రీ ప‌లు త‌మిళ‌, తెలుగు సినిమాల‌తో బిజీ బిజీగా ఉండ‌డంతో మ‌రింత టైం కావాల‌ని ద‌ర్శ‌కుడు క్రిష్‌ను కోర‌గా క్రిష్ దేవిపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. క్రిష్ మ్యూజిక్ ప‌నులు లేట్ అయ్యేందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో దేవిశ్రీ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేయాలని బాలకృష్ణ, క్రిష్ భావిస్తున్నారు. ఈ టైంలో దేవి ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డంతో క్రిష్ మ‌రో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంపిక వేట‌లో ప‌డిన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. క్రిష్ సినిమాకు సంగీతం అందించిన చిరంత‌న్ భ‌ట్‌తో పాట‌లు కంపోజ్ చేయించి..మ‌ణిశ‌ర్మ‌తో ఆర్ ఆర్ చేయిస్తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

చంద్ర‌బాబు కోపం చ‌ల్లార్చిన అచ్చెన్న, య‌న‌మ‌ల‌
త్రిష‌ను మోసం చేసిన మేనేజ‌ర్‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*