ప్రకాష్ రాజ్ తాత.. శర్వానంద్ మనవడు

Share this News:

కొన్నేళ్ల కిందట తెలుగులో తండ్రి పాత్ర అనగానే ప్రకాష్ రాజే గుర్తుకొచ్చేవాడు. హీరోకైనా.. హీరోయిన్ కైనా తండ్రి పాత్ర అంటే ప్రకాష్ రాజ్ అంత చక్కగా ఒదిగిపోయాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రకాష్ రాజ్ బాగా స్లో అయిపోయాడు. అప్పుడప్పుడూ మాత్రమే ఆయన తెరమీద కనిపిస్తున్నారు. ఐతే చాన్నాళ్ల తర్వాత ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో ఓ క్రేజీ ప్రాజెక్టు రాబోతోంది.

శర్వానంద్ హీరోగా దిల్ రాజు నిర్మించబోయే ‘శతమానం భవతి’లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తమ బేనర్లో మరో ‘బొమ్మరిల్లు’గా దిల్ రాజు చెబుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తాత పాత్ర పోషిస్తుంటే.. శర్వానంద్ మనవడి పాత్ర చేయబోతుండటం విశేషం. ఇంతకుముందు ప్రకాష్ రాజ్.. ‘గోవిందుడు అందరివాడేలే’ తాత క్యారెక్టర్లో అలరించాడు. ‘బొమ్మరిల్లు’లో తండ్రి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచిన ప్రకాష్ రాజ్.. బొమ్మరిల్లు-2గా చెబుతున్న సినిమాలో తాత పాత్రలో ఎలా చేస్తాడో చూడాలి.

రైటర్ టర్న్డ్ డైరెక్టర్ సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ‘శతమానం భవతి’ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ ఏడాది ఆఖర్లోపు ఈ చిత్రాన్ని పూర్తి చేసి సంక్రాంతికే రిలీజ్ చేస్తామని దిల్ రాజు చెబుతున్నాడు. ముందు సాయిధరమ్ తేజ్.. ఆ తర్వాత రాజ్ తరుణ్ లను ఈ చిత్రానికి కథానాయకులుగా అనుకుని.. చివరికి శర్వాతో చేస్తున్నారు

వెంకీకి వార్నింగ్ ఇచ్చింది ఎవ‌రు
బీజేపీపై టీజీ షాకింగ్ కామెంట్స్‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*