తారక్ చెప్పిన రెండు మంచి మాటలు

Share this News:

దాదాపు 20 నిమిషాలు.. జనతా గ్యారేజ్ ఆడియో వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సాగిన సమయమిది. స్టార్ హీరోల సినిమాల ఆడియో వేడుకల సందర్భంగా సాగిన అత్యంత సుదీర్ఘ ప్రసంగాల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టే ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎన్టీఆర్ కు ఎంత ప్రత్యేకమో కూడా అర్థం చేసుకోవచ్చు. ఆద్యంతం చాలా ఎమోషనల్ గా.. పద్ధతిగా మాట్లాడిన తారక్.. చివర్లో అభిమానులకు హితబోధ చేస్తూ రెండు మంచి విషయాలు చెప్పాడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజవుతున్నపుడు కటౌట్ల మీద పాలాభిషేకాలు.. జంతు బలులు పెద్ద ఎత్తున జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అభిమానులకు హితబోధ చేశాడు తారక్.
‘‘నాన్నకు ప్రేమతో విడుదలైనపుడు అభిమానుల హంగామాకు సంబంధించి కొన్ని ఫొటోలు చూశా. అందులో ఒక ఫొటో చూస్తే చాలా బాధేసింది. నా కటౌట్ కు పాలాభిషేకం చేస్తున్నారు. దయచేసి అభిమానులు ఇలాంటివి చేయొద్దు. ఆ పాలను తీసుకెళ్లి అనాథ శరణాలయంలో ఇచ్చి వారి కడుపు నింపండి. ఎందరో గర్భిణులు.. ముసలివాళ్లు పౌష్టికాహారం లేక అలమటిస్తుంటారు. వాళ్లను ఆదుకోండి. అలాగే ఇంకో చోట సినిమా విడుదలవుతుంటే జంతువుల్ని బలివ్వడం చూశాను. అది కూడా నన్ను బాధించింది. దీని బదులు థియేటరుకు వచ్చిన వాళ్లందరికీ అన్నదానం చేయండి. నామీద మీ అభిమానాన్ని చంపుకోవద్దు. అలాగని ఇలాంటి పనులు చేయొద్దు. నేనేదో గొప్ప… నాకు పాలాభిషేకాలు చేస్తారు అని చెప్పుకోవడానికి ఈ విషయాలు చెప్పట్లేదు’’ అని ఎన్టీఆర్ అన్నాడు.

పౌరుషమున్నోడు కామెడీ మీద పడ్డాడే!
జనత గ్యారేజ్… ట్రైలర్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*