పౌరుషమున్నోడు కామెడీ మీద పడ్డాడే!

Share this News:

యాక్షన్ సినిమాలను పక్కనపెట్టేసి.. కామెడీ సినిమాలతోనే జర్నీ చేయడం సేఫ్ జోన్ అనుకున్నాడో ఏమో విష్ణు.. ఇప్పుడు వరుబెట్టి కామెడీ సినిమాలు చేస్తున్నాడు. గతంలో కూడా కామెడీనే ప్రధానంగా తెరకెక్కిన అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా హిట్ అయ్యాయి. దాంతో అదే జోనర్ ను ఫాలో అయిపోతున్నాడు ఈ మంచు వారబ్బాయి. తాజాగా ‘లక్కున్నోడు’ పేరుతో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు. ఇది సెప్టెంబరు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సరదా అనే సినిమాలో నటిస్తున్న విష్ణు… దీన్ని వేగంగా కంప్లీట్ చేసేసి.. లక్కున్నోడుపై దృష్టి సారించనున్నాడు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ప్రస్తుతం విష్ణు చేస్తున్న ‘సరదా’ సినిమాలో అంజలి, సోనారిక నటిస్తున్నారు. సోనారిక ‘ఈడోరకం.. ఆడోరకం’ మూవీలో విష్ణు సరసన నటించిన విషయం తెలిసిందే. మరి లక్కున్నోడు సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తుందనేది త్వరలోనే తెలియజేస్తామని చిత్ర నిర్మాత చెబుతున్నారు.

ఈ చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల్లో న‌టిస్తున్న విష్ణు మంచు హీరోగా మా బ్యాన‌ర్లో సినిమా చేయ‌నుండ‌టం చాలా హ్యాపీగా ఉంది. ఈడోరకం -ఆడోర‌కం వంటి సూప‌ర్‌హిట్ చిత్రం త‌ర్వాత ఆయ‌న చేస్తున్నల‌వ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైనర్ `ల‌క్కున్నోడు`. గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుక‌న్న రాజ్‌కిర‌ణ్‌ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. ఆయ‌న చెప్పిన పాయింట్ విన‌గానే మంచు విష్ణు సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాకు రైటర్ డైమండ్ ర‌త్నంబాబు ర‌చ‌న‌, క‌థా విస్త‌ర‌ణ‌, మాట‌లు అందిస్తున్నారు. సాయిశ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మ‌ధు ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ రెండ‌వ వారం త‌ర్వాత సెట్స్‌ లోకి వెళుతుంది’ అన్నారు.

గ్యారేజ్ రిలీజ్‌కు కొత్త డేట్ ..!
తారక్ చెప్పిన రెండు మంచి మాటలు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*