మేకులా మారుతున్న బాబు ద‌గ్గ‌రి నాయ‌కుడు

Share this News:

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు స‌ర్వం సిద్ధం చేసుకున్న విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇపుడు ఏకు మేకులా మారుతున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. సైకిల్ ఎక్కేందుకు అంతా సిద్ధం చేసుకున్న త‌ర్వాత ఆగిపోయిన కొణ‌తాల తాజాగా ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల‌పై గ‌ళం ఎత్తారు. ఏకంగా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో క‌లిసి క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల కమిటీ చైర్మన్‌ కొణతాల రామకృష్ణ ఈ టూర్ల‌న్నింటినీ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన కొణ‌తాల ఉత్తరాంధ్రకు సాగు, తాగు నీటి అవసరాలకు పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని  అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏడెనిమిదేళ్లు పడుతుందని నిపుణులు చెబుతుండడంతో ఉత్తరాంధ్ర సాగునీటి అవసరాలను అధ్యయనానికి ప్రాజెక్టు సాధన సమితి కృషి చేస్తోందని తెలిపారు. విశాఖపట్నానికి నీరు సరఫరా చేయాలంటే పోలవరం ఎడమ కాలువ పూర్తి చేసి ఇరువైపులా ఎనిమిది రిజర్వాయర్లు నిర్మించాలని కొణ‌తాల అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న అరకొర నిధులను బట్టి చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తికాదని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ కనబరచడం లేదని మండిప‌డ్డారు. మ‌రోవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకం తరహాలోనే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, పోలవరం ఎడమ కాలువ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలా చేస్తే తూర్పు, విశాఖ జిల్లాల్లోని నాలుగు లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు నీరందుతుందన్నారు.

ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి పథకం  మొదటి దశ దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర రెడ్డి హ‌యాంలో 2009లో మంజూరైనా ప్ర‌స్తుతం ప్ర‌స్తుతం దానిని పక్కన పెట్టారని కొణ‌తాల మండిప‌డ్డారు. తొలి దశలో పోలవరం ఎడమ కాలువ పనులను 58 కిలోమీటరు వరకు పూర్తిచేస్తే, గోదావరి  నీటిని ఏలేరు రిజర్వాయర్‌కు మళ్లించడం ద్వారా విశాఖ జిల్లాకు నీరందించవచ్చన్నారు. రెండో దశలో పోలవరం ఎడమ కాలువ 58 కిలోమీటరు నుంచి 142 కిలోమీటరు వరకు పనులను పూర్తి చేసి ప్రస్తుత ఏలేరు కాల్వకు అనుసంధానం చేయాలన్నారు. విశాఖకు నీరు సరఫరా చేయడానికి కాలువకు ఇరువైపుల ఎనిమిది రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌క‌ట‌న‌లే చేయ‌డం కాకుండా ఏకంగా క‌మ్యూనిస్టు నాయ‌కుల‌తో క‌లిసి ప‌ర్య‌ట‌న‌లు చేస్తుండ‌టం, చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వైఎస్‌ను కీర్తించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

కేసీఆర్‌-కేవీపీల మ‌ధ్య బ‌ల‌ప‌డుతున్న బంధం
కొత్త జిల్లాల‌పై గొప్ప లాజిక్ చెప్పిన రేవంత్‌

Share this News:

1 Comment on మేకులా మారుతున్న బాబు ద‌గ్గ‌రి నాయ‌కుడు

  1. If it was sanctioned in2009,what are you doing all the while when you were a minister post2009?

Leave a comment

Your email address will not be published.

*